BREAKING
సేవా మూర్తులకు బీజేపీ సన్మానం సింగరేణి పెన్షనర్లకు సౌకర్యవంతంగా డీఎల్‌సీ రెన్యూవల్ సేవలు - తొలిరోజు 185 మందికి సేవలు కృష్ణానదిలో వలలో చిక్కుకుని మత్స్యకారుడి మృతి ఉల్లిపాలెంలో విషాదఛాయలు.. కుటుంబ సభ్యుల రోదనలు వార్షిక గది ఆదాయ వృద్ధి అంచనాలను పెంచిన మేరియట్ ఇంటర్నేషనల్ మంగి గ్రామానికి బస్సు సేవలు ప్రారంభం - గ్రామస్తుల హర్షం సాయి కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలోడ్రంక్ అండ్ డ్రైవ్ పై ఉక్కు పాదం-ఇద్దరికీ జైలు ముగ్గురికి జరిమానా ఇరాన్‌పై డోనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు..గల్ఫ్ దేశాలలో మళ్లీ రాజుకుంటున్న యుద్ధ భయాలు పాఠశాలల్లో అల్పాహారం ప్రారంభం ఆపదలో ఉన్న రైతుకు అండగా నిలిచిన చైతన్య కిరణ్ ఎల్ నినో దృష్ట్యా విద్యుత్తును పొదుపు చేయండి... హంగేరి రాజకీయాల్లో కొత్త చీఫ్ ప్రాసిక్యూటర్ అభ్యర్థికి మద్దతు తెలిపిన అధికార పార్టీ ఉద్యోగులు విధి నిర్వహణతో పాటు తమ ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. 'సెంపాయింట్ పార్టనర్స్' పేరుతో కొత్త ప్రాక్సీ సొలిసిటింగ్ సంస్థను ప్రారంభించిన అనుభవజ్ఞులు వర్షాభావంపై క్షేత్రస్థాయి పరిశీలన తుగ్గలి మండలంలో కేంద్ర కరువు బృందం పర్యటన రైతులతో ముఖాముఖి.. పంట నష్టాల అంచనా సోమాలియా నుంచి సైనిక ఉపసంహరణ ప్రారంభించిన ఉగాండా

కావలిలో ముందస్తు చర్యలు వేగవంతం – తీరప్రాంతాలు, పునరావాస కేంద్రాలను పరిశీలించిన ఆర్డీఓ, తహసీల్దార్.

Select Suryaa Now
కావలిలో ముందస్తు చర్యలు వేగవంతం – తీరప్రాంతాలు, పునరావాస కేంద్రాలను పరిశీలించిన ఆర్డీఓ, తహసీల్దార్.

​కావలి, మేజర్ న్యూస్ :   బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం 'మరుసు' తుఫానుగా రూపంతరం చెందింది. ఈ తుఫాను సోమవారం రాత్రి తీరం దాటే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కావలి రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తమై ముందస్తు రక్షణ చర్యలను వేగవంతం చేసింది.  ​ఈ ముందస్తు చర్యల్లో భాగంగా కావలి ఆర్డీఓ  ఎలీషా బాబు, మండల రెవెన్యూ అధికారి తహసీల్దార్ శ్రావణ్ కుమార్ రెవెన్యూ సిబ్బందితో కలిసి తీరప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు.
​తీర ప్రాంతాల పరిశీలన – మత్స్యకారులకు సూచనలు : కావలి మండల పరిధిలోని సముద్ర తీర ప్రాంతాలైన వెంకటేశ్వరపురం, జువ్వలదిన్నె, షిప్పింగ్ హార్బర్ మరియు వివిధ రిలీఫ్ సెంటర్లను ఆర్డీఓ, ఎమ్మార్వో ప్రత్యేకంగా పరిశీలించారు. అర్బన్ ప్రాంతాల్లో నివాసముంటున్న మత్స్యకారులను కలిసి తుఫాన్ తీవ్రతను వివరించారు. ఎవరూ సముద్ర వేటకు వెళ్లవద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని తగు సూచనలు, సలహాలు అందించారు. అత్యవసర పరిస్థితి ఏర్పడితే అధికారులకు సమాచారం అందించాలని కోరారు.
​గిరిజన కుటుంబాల తరలింపు : కావలి పట్టణ పరిధిలోని వైకుంఠపురంలో నివసిస్తున్న గిరిజన సామాజిక వర్గానికి చెందిన సుమారు 50 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. లోతట్టు, తాత్కాలిక నివాసాల్లో ఉన్న వీరిని పునరావాస కేంద్రాలకు వేగంగా తరలించి, వారికి కావలసిన ప్రాథమిక సౌకర్యాలు కల్పించేలా ఆర్డీఓ ఎలీషా బాబు, తహసీల్దార్ శ్రావణ్ కుమార్ దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ​ఈ కార్యక్రమంలో రెవెన్యూ యంత్రాంగం, విఆర్ఓలు, ఆర్ఐలు మరియు ఇతర సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. తుఫాను ప్రమాదం పూర్తిగా తొలగిపోయే వరకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.