BREAKING
నెల్లూరులో ఘనంగా వికసిత భారత్ యువ నాయకుల సంభాషణ – 2027 యువజన పార్లమెంట్ ముందస్తు గుర్తింపే రొమ్ము క్యాన్సర్‌కు సరైన రక్ష: కిమ్స్ వైద్య నిపుణులు కార్మికులకు 8 గంటల పని దినాన్ని చట్టంగా తెచ్చింది ఏఐటీయూసీ దేశీయంగా తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయాలనే మివి లక్ష్యం సేవే లక్ష్యం అభివృద్ధి అభివృద్దే మా విధానం. గిరిజన ప్రాంతాల్లో రహదారులు, బస్సులు ఏర్పాటు చేయాలి మర్రిపాడు మండలమంటే నాన్నకు అమితమైన ప్రేమ టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ గణేష్ గౌడ్ దానిమ్మ తోటల్లో ఎండు తెగులుపై శాస్త్రవేత్తలు పరిశీలన దేశీయంగా తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయాలనే మివి లక్ష్యం మంత్రి శ్రీధర్ బాబు అభివృద్ధితో పాటు పచ్చదనానికి పెద్దపీట నువ్వురుపాడులో టిడిపి అభ్యర్థుల ముమ్మర ఎన్నికల ప్రచారం మృతుల కుటుంబాలకు రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జర్పుల దశరథ్ నాయక్ చేయూత గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజాసేవే మా లక్ష్యం: వైసీపీ నాయకుడు గడ్డం రంజాన్ అందరూ ఆశీర్వదించి విజయం చేకూరిస్తే ఆత్మకూరు అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తా

కావలిలో ఘనంగా ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ వేడుకలు.

Select Suryaa Now
కావలిలో ఘనంగా ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ వేడుకలు.

​కావలి,  మేజర్ న్యూస్ :  కావలి పట్టణంలోని ఏఐటీయూసీ కార్యాలయం వద్ద ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) 107వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గ అధ్యక్షులు చెవురు చిట్టిబాబు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామ అంకయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి జెండా ఆవిష్కరించారు.
​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బ్రిటీష్ కాలంలో, 1920 అక్టోబర్ 31న లాలా లజపతిరాయ్ అధ్యక్షతన బొంబాయిలో ఏర్పడిన ఏఐటీయూసీ, 107 ఏళ్లుగా కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతోందని కొనియాడారు.
​ప్రధాన డిమాండ్లు:
​కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలి.
​సమాన పనికి సమాన వేతనంగా కనీస వేతనం రూ. 36,000 అమలు చేయాలి.
​కార్మికుల హక్కులను హరించే 4 లేబర్ కోడ్స్‌ను తక్షణమే రద్దు చేయాలి.
​పెరిగిన నిత్యవసర ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి.
​భవన నిర్మాణ కార్మికులకు యాక్సిడెంట్ పథకం, ఆటో, హమాలీ, వీధి వ్యాపారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి.
​కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక, ప్రైవేటీకరణ విధానాలను ఎండగట్టాలని, కార్మికులంతా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఐక్యంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.
​ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి పాముల శ్రీనివాసులు, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి కొప్పర్తి నాగరాజు, సహాయ కార్యదర్శి పి. బోసు, నాయకులు పి. సుబ్బారావు, కే. నరసింహ, గుర్రం వేణు, గుంజి శ్రీను, వెల్లెపు లక్ష్మి, పరుసు లక్ష్మి, షేక్ సుభాని, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.