కార్తీక పౌర్ణమికి మంగినపూడి బీచ్‌కు ప్రత్యేక బస్సులు
మచిలీపట్నం, మేజర్ న్యూస్: కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ నెల 24వ తేదీన మంగినపూడి బీచ్‌లో సముద్ర స్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులు, ప్రయాణికుల సౌకర్యార్థం ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ నెల 22వ తేదీ ఆదివారం నుంచి కృష్ణా జిల్లా పరిధిలోని అవనిగడ్డ, మచిలీపట్నం, గుడివాడ, గన్నవరం, ఉయ్యూరు డిపోల నుంచి మంగినపూడి బీచ్‌కు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు కృష్ణా జిల్లా ప్రజా రవాణా అధికారి కొడమంచిలి వెంకటేశ్వర్లు తెలిపారు. అదేవిధంగా మచిలీపట్నం కోనేరు సెంటర్ నుంచి బయలుదేరి ఆర్టీసీ బస్టాండ్ మీదుగా మంగినపూడి బీచ్‌కు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానాలకు వచ్చే భక్తులు, ప్రయాణికులు ఆర్టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులను వినియోగించుకోవాలని ఆయన కోరారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మచిలీపట్నం, కృష్ణాజిల్లా.