BREAKING
రూ. 8,415 కోట్ల AT-1 బాండ్ల రద్దు తీర్పుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన యెస్ బ్యాంక్ సిగరెట్ ధరలను మళ్లీ పెంచిన ఐటీసీ: గోల్డ్ ఫ్లేక్, క్లాసిక్ కనెక్ట్ కొత్త రేట్లు ఇవే నేటి పంచాంగం 14 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు (14 నవంబర్ 2026, శనివారం): 12 రాశుల దినఫలాలు ఇవే మాస్కోలో భారీ కారు బాంబు పేలుడు: రష్యా అనుకూల నేత సెర్గీ జవోరోట్నీకి తీవ్ర గాయాలు అదానీ విద్యుత్ ప్రాజెక్టు వ్యయం తగ్గింపుపై కేంద్ర పర్యావరణ శాఖ విచారణ చకుముఖి టాలెంట్ టెస్టులో శ్రీవాణి విద్యార్థుల ప్రతిభ మండల స్థాయి పోటీలకు ముగ్గురు విద్యార్థుల ఎంపిక పాకిస్థాన్‌కు సైనిక రహస్యాల చేరవేత: వాయుసేన వింగ్ కమాండర్‌పై చార్జిషీట్ దాఖలు చేసిన ఢిల్లీ పోలీసులు రైతుల విద్యుత్ కష్టాలకు తెర.. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు ఎల్నినో ప్రభావం నేపథ్యంలో వార్డుల్లో నీటిని, విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలి ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయ నావికుడు...అత్యవసర సర్టిఫికేట్ జారీ, త్వరలో స్వదేశానికి రాక భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును కాపాడుకుందాం నగర సంకీర్తనతో ఆధ్యాత్మిక మేలుకొలుపు ఏకంగా 22 కిలోల బరువు తగ్గిన ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి.. కొత్త లుక్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే! పరాగ్వే మాజీ అధ్యక్షుడు శాంటియాగో పెన్యాపై మరింత ఉచ్చు

కార్పొరేషన్ ఎన్నికలకు వైసీపీ కసరత్తు

Select Suryaa Now
కార్పొరేషన్ ఎన్నికలకు వైసీపీ కసరత్తు

                      రాజమహేంద్రవరం కార్పొరేషన్‌లో 30 డివిజ న్లపై ప్రత్యేక దృష్టి
రాజమహేంద్రవరం రూరల్, మేజర్ న్యూస్,:రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను ప్రతిష్టాత్మకం గా తీసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే రాజకీయ వ్యూహా లకు పదును పెడుతోంది. ఎన్నికల బరిలో బలమైన అభ్యర్థులను నిలబెట్టి కార్పొరేషన్‌పై పట్టు సాధించాలనే లక్ష్యంతో డివిజన్ల వారీగా క్షేత్ర స్థాయి పరిస్థితులను విశ్లేషిస్తోంది. ఇందులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలోను, వెంకటనగరంలోనూ నాయకులతో కలిసి కార్పొరేటర్ అభ్యర్థుల ఎంపికపై ముమ్మర కసరత్తు చేపట్టారు.

జిల్లా పార్టీ అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ యువజ న విభాగం రాష్ట్ర అధ్యక్షు డు జక్కంపూడి రాజా, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల యువజన విభా గం మాజీ రీజనల్ కోఆర్డి నేటర్ జక్కంపూడి గణేష్, ఇతర ముఖ్య నాయకు లు పాల్గొన్నారు. రాజమ హేంద్రవరం రూరల్, రాజానగరం నియోజక వర్గాల పరిధిలోకి వచ్చే 30 డివిజన్లకు సంబం ధించి స్థానిక నాయకుల తో సుదీర్ఘంగా చర్చిం చారు.

అభ్యర్థుల ఎంపికలో కేవలం వ్యక్తిగత పరిచ యాలు, పార్టీ పట్ల విధేయత మాత్రమే కాకుండా సామాజిక వర్గాల ప్రాతినిధ్యం, స్థానికంగా ప్రజల్లో ఉన్న ఆదరణ, ఆర్థిక, రాజకీ య సామర్థ్యం, ఎన్నికల నిర్వహణలో అనుభవం, ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కొనే శక్తి వంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నట్లు తెలుస్తోం ది. ఆయా డివిజన్లలో పార్టీకి ఉన్న అనుకూల తలు, ప్రతికూలతలు, గత ఎన్నికల ఫలితాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థి తులను కూడా నాయకు లు విశ్లేషించారు.

ముఖ్యంగా కూటమి పార్టీల తరఫున బరిలో నిలిచే అవకాశం ఉన్న అభ్యర్థుల సామాజిక, రాజకీయ బలాబలాలను అంచనా వేస్తూ, వారికి ధీటైన అభ్యర్థులను ఎంపిక చేయడంపై ప్రత్యేక దృష్టి సారించారు. స్థానిక నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుం టూనే, ప్రతి డివిజన్‌లో గెలుపు అవకాశాలను విడివిడిగా బేరీజు వేసుకున్నారు.

రాజమహేంద్రవరం కార్పొరేషన్‌లో మొత్తం 72 డివిజన్లు ఉండగా, ప్రస్తుత కసరత్తులో రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం నియోజకవర్గాల పరిధి లోని 30 డివిజన్లపై కసరత్తు కొనసాగుతుంది. డివిజన్ల వారీగా ఖరారైన రిజర్వేషన్లు అనుసరించి బలమైన  అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా చర్చించారు.