కామరాజుగడ్డ నార్త్ సర్పంచ్‌గా జొన్న శ్రీనివాసరావు (వాసు), ఉపసర్పంచ్‌గా బాపనేశ్వరరావు ఏకగ్రీవ ఎన్నిక నూతన ప్రజాప్రతినిధులకు అనగాని శివప్రసాద్ అభినందనలు
రేపల్లె మేజర్ న్యూస్;
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రేపల్లె మండలం కామరాజుగడ్డ నార్త్ గ్రామ సర్పంచ్‌గా జొన్న శ్రీనివాసరావు (వాసు), ఉపసర్పంచ్‌గా బాపనేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్ జొన్న శ్రీనివాసరావు (వాసు), ఉపసర్పంచ్ బాపనేశ్వరరావు రేపల్లెలోని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రేపల్లె నియోజకవర్గ కోఆర్డినేటర్ అనగాని శివప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా అనగాని శివప్రసాద్ వారికి శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు. గ్రామ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆకాంక్షించారు.
ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్, ఉపసర్పంచ్ గ్రామ ప్రజల సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు నూతన ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలియజేశారు.