BREAKING
కడప అమీన్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం: పీఠాధిపతి అరీఫుల్లా హుస్సేనీ ప్రత్యేక భేటీ! రాజధాని పనులపై నిర్మాణ సంస్థలతో సీఎం చంద్రబాబు సమీక్ష: 21 కి.మీ ఎత్తులో డీఆర్‌డీవో హై-ఆల్టిట్యూడ్ ఎయిర్‌షిప్ పరీక్ష విజయవంతం: దేశీయ హెచ్‌పీవీ వ్యాక్సిన్ ‘సెర్వావాక్’కు డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు... కెన్యాలో తొలి ఎబోలా కేసు నిర్ధారణ: చికిత్స పొందుతూ రోగి మృతి.. అప్రమత్తమైన ఆరోగ్యశాఖ, డబ్ల్యూహెచ్‌వో! ఆశ వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలి :ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ కు వినతిపత్రం పేదలకు ప్రయోజనం చేకూర్చే ‘మీ మార్ట్’ ప్రారంభం రామన్నపాలెంలో పంచాయతీ కార్యదర్శులు, హరిత రాయబారులకు శిక్షణ కార్యక్రమం పొలం సంఘం ది - రిజిస్ట్రేషన్ వేరొకరికి ...:ఈతకోట బాబా నగర్ కాలనీ వాసులు కలెక్టర్ కు ఫిర్యాదు నేటి రాశి ఫలాలు – 7 అక్టోబర్ 2026 (బుధవారం) మామునూరు ఎయిర్ పోర్టుకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టాలి నేటి పంచాంగం 7 అక్టోబర్ 2026,బుధవారం ఉర్సు రావణాసుర వధ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయి గిరిజన చట్టాలకు తూట్లు

కాకినాడ భవిష్యత్తుకు నైపుణ్య పునాది! కాకినాడ రాజ్యసభ ఎంపీ సానా సతీష్ కృషి

Select Suryaa Now
కాకినాడ భవిష్యత్తుకు నైపుణ్య పునాది! కాకినాడ రాజ్యసభ ఎంపీ సానా సతీష్ కృషి

కాకినాడ భవిష్యత్తుకు ‘నైపుణ్య’ పునాది!

ఎంపీ నిధుల్లో యువత ఉద్యోగ, ఉపాధికే సానా ప్రాధాన్యం

  • రూ.5.30 కోట్ల ఎంపీ ల్యాడ్స్‌తో స్కిల్‌–స్టార్టప్‌–భారత్‌ హబ్‌కు శ్రీకారం
  • ఏటా వెయ్యి మందికి శిక్షణ–ఉపాధి.. వంద మంది యువ పారిశ్రామికవేత్తలు లక్ష్యం
  • పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాల్లోనే యువతకు శిక్షణ
  • ఏఐ నుంచి ఆక్వా వరకు.. కాకినాడకు ఉపయోగపడే రంగాలపై దృష్టి
  • 12న సీఐఐ సదస్సు.. కొత్త పెట్టుబడులతో ఉద్యోగాలకు మరో అవకాశం


ఉమ్మడి గోదావరి జిల్లాల ‘సూర్య’ బ్యూరో

ఎంపీ ల్యాడ్స్‌ నిధులంటే ఎక్కువగా రోడ్లు.. డ్రైన్లు.. సామాజిక భవనాలే కనిపిస్తాయి. కాకినాడలో మాత్రం యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తన ఎంపీ ల్యాడ్స్‌ నుంచి రూ.5.30 కోట్లు కేటాయించారు రాజ్యసభ సభ్యుడు సానా సతీష్‌బాబు. ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో ‘స్కిల్‌–స్టార్టప్‌–భారత్‌ హబ్‌’కు సోమవారం పునాది పడింది. చదువు పూర్తిచేసుకుని బయటకు వచ్చే యువతకు పరిశ్రమల్లో అవసరమైన నైపుణ్యం నేర్పి, ఉద్యోగ అవకాశాలు పెంచడమే ఈ కేంద్రం లక్ష్యం.

మూడేళ్ల క్రితమే ఆలోచన

మూడేళ్ల క్రితం ‘కాకినాడ జిల్లా కోసం’ పేరుతో ఇంటింటికీ, విద్యార్థుల వద్దకు వెళ్లి ప్రశ్నావళితో సర్వే నిర్వహించినట్లు సానా తెలిపారు. అందులో 80 శాతం మంది ఉద్యోగాలు, ఉపాధిపైనే దృష్టి పెట్టాలని కోరినట్లు చెప్పారు. రాజ్యసభ సభ్యుడైన తర్వాత యువత ఉపాధిపై పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు.

ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో కేటాయించిన రెండు ఎకరాల్లో రూ.15 నుంచి రూ.20 కోట్లతో ఈ హబ్‌ను ఏర్పాటు చేయనున్నారు. తొలి విడత స్కిల్‌ సెంటర్‌కు సానా తన ఎంపీ ల్యాడ్స్‌ నుంచి రూ.5.30 కోట్లు ఇచ్చారు. కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి సోమవారం పనులకు శంకుస్థాపన చేశారు.

పరిశ్రమ కోరిందే నేర్పిస్తారు

కాకినాడ పరిసరాల్లోని పలు పరిశ్రమల ప్రతినిధులతో ఇప్పటికే మాట్లాడినట్లు సానా తెలిపారు. ఆయా పరిశ్రమలకు ఎలాంటి నైపుణ్యం ఉన్న యువత అవసరమో తెలుసుకుని, అందుకు తగ్గట్టుగా శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, వెబ్‌ డెవలప్‌మెంట్‌, డ్రోన్స్‌, అగ్రిటెక్‌, గ్రీన్‌ ఎనర్జీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఆక్వా, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. భవనం పూర్తయ్యే వరకు వేచి చూడకుండా స్థానిక కళాశాలల సహకారంతో శిక్షణ కూడా మొదలుపెట్టారు. ఐదు నెలల క్రితం 35 మందికి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించినట్లు సానా వెల్లడించారు.

20 వేల మందిలో తొలి వెయ్యి

కాకినాడ జిల్లా నుంచి ఏటా సుమారు 20 వేల మంది వివిధ కోర్సులు పూర్తిచేసుకుని బయటకు వస్తున్నారని సానా తెలిపారు. వీరిలో ఏటా వెయ్యి మందికి శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించడం, మరో 100 మందిని సొంతంగా వ్యాపారాలు ప్రారంభించేలా తీర్చిదిద్దడం తొలి లక్ష్యంగా పెట్టుకున్నారు.

యువత సొంతంగా వ్యాపారాలు ప్రారంభించేందుకు అవసరమైన సలహాలు, సహకారం కూడా ఇక్కడే అందించనున్నారు. డిజిటల్‌ లైబ్రరీ, వివిధ రంగాల నిపుణుల సూచనలు, ప్రభుత్వ పథకాల వివరాల కోసం ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేయనున్నారు. రెండో విడతలో తుని, కోనసీమతో పాటు దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు హాస్టల్‌ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

12న పెట్టుబడుల సదస్సు

ఇదే సమయంలో ఈ నెల 12న జేఎన్‌టీయూలో సీఐఐ ప్రాంతీయ సదస్సు జరగనుంది. కొత్త పరిశ్రమలను కాకినాడకు తీసుకొచ్చేందుకు పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలతో జిల్లా యంత్రాంగం సమావేశం కానుంది. సుమారు 30 అవగాహన ఒప్పందాలు జరిగే అవకాశం ఉందని, వాటిలో 15 వరకు కార్యరూపం దాల్చవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

కొత్త పరిశ్రమలు రావడం ఎంత ముఖ్యమో.. వాటిలో స్థానిక యువతకు ఉద్యోగాలు దక్కడం కూడా అంతే ముఖ్యం. అందుకు అవసరమైన నైపుణ్యాన్ని ముందుగానే నేర్పించాలన్న ప్రయత్నమే ఇప్పుడు ఐటీఐ ప్రాంగణంలో మొదలైంది.

ఉద్యోగం వస్తేనే ఫలితం

రూ.5.30 కోట్లతో స్కిల్‌ సెంటర్‌కు పునాది పడింది. ఏటా వెయ్యి మందికి శిక్షణ–ఉపాధి, వంద మందిని సొంతంగా వ్యాపారాలు చేసే స్థాయికి తీసుకెళ్లాలన్న లక్ష్యం పెట్టుకున్నారు.

ఇక్కడ శిక్షణ పొందిన యువతకు కాకినాడలోనే ఉద్యోగం దక్కాలి. కొత్తగా వచ్చే పరిశ్రమల్లో స్థానికులకు అవకాశాలు పెరగాలి. అలా జరిగితేనే రూ.5.30 కోట్లతో మొదలైన ఈ స్కిల్‌ హబ్‌ లక్ష్యం నెరవేరినట్లవుతుంది.