BREAKING
అటవీ అమరవీరుల త్యాగం సిరస్మరణీయం ప్రతిరోజూ ఉదయం సోంపు వాటర్ తాగుతున్నారా.. అయితే ఈ ఆరోగ్య రహస్యాలు మీకోసమే! పాత కొమ్ముగూడెంలో పలు నిర్మాణ పనులకు శ్రీకారం చలికాలంలో ఈ ఏడు పొరపాట్లు అస్సలు చేయకండి.. చిన్న నిర్లక్ష్యమే పెద్ద అనారోగ్యానికి దారితీస్తుంది! ప్రతి రోజు ఒక గ్లాసు పసుపు పాలు తాగుతున్నారా.. అయితే ఈ ఆరోగ్య ప్రయోజనాలు మీకోసమే! బిక్కవోలు జనసేనకు 100% విజయం 400 క్వింటాల సబ్సిడీ సెనగ ఇన్‌స్టాగ్రామ్‌లో మెటా ఏఐ ఏజ్-చెక్: గ్లోబల్ విస్తరణ మహిళా భవన్ నిర్మాణానికి భూమి పూజ. జాతీయ లోక అదాలత్ ను జయప్రదం చేయాలి అండాల సేకరణ అక్రమ దందాపై సర్కారు ఉక్కుపాదం తాగునీటి సరఫరా పై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు నజీబ్ రజాక్ గృహ నిర్బంధానికి కోర్టు అనుమతి: మలేషియాలో సంచలనం ప్రవచన మండపం ముందు భవనం ఎత్తు పెంపు కేటీఆర్‌నుమర్యాదపూర్వకంగా కలిసిన గోలి శ్రీనివాస్ రెడ్డి

కాబోయే ఎంపీపీ నారాయణస్వామికి అభినందనల వెల్లువ

Select Suryaa Now
కాబోయే ఎంపీపీ నారాయణస్వామికి అభినందనల వెల్లువ

గరుగుబిల్లి, సూర్య : మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ)గా త్వరలోనే బాధ్యతలు చేపట్టబోతున్న మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ మరడాన నారాయణ స్వామికి మండల పరిధిలోని ఆయా గ్రామాల నుంచి అధిక సంఖ్యలో నాయ కులు, కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. దీంతో ఉల్లిభద్ర గ్రామం లోని కాబోయే ఎంపీపీ మరడాన నారాయణస్వామి ఇంటి వద్ద మంగళవారం పండుగ వాతావరణం నెలకొంది. త్వరలోనే మండల పరిషత్ (ఎంపీపీ) పీఠాన్ని అధిష్టించబోతున్న ఎంపీపీ మరడాన నారాయణస్వామికి మండల పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానుల నుండి అభినందనల వెల్లువ కొనసాగుతోంది. అదే విధంగా కాబోయే ఎంపీపీ మరడాన నారాయణస్వామికి పుష్పగుచ్చాలు అందజేసి, పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం పలువురు నాయకులు, అభిమానులు మాట్లాడుతూ పార్టీ కోసం నిస్వార్ధంగా పనిచేసిన మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ మరడాన నారాయణస్వామికి ఎంపీపీ పదవి దక్కడం ఎంతో ఆనందం గా ఉందన్నారు. నారాయణస్వామి  నాయకత్వంలో మండలం అన్ని రంగా ల్లో మరింత అభివృద్ధి చెందుతుందని ఆశా భావం వ్యక్తం చేశారు. ఈ సంద ర్భంగా అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కాబోయే ఎంపీపీ మరడాన నారాయణస్వామి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కాబోయే ఎంపీపీ మరడాన నారాయణస్వామి మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈబాధ్యత ను అప్పగించిన తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి, అండగా నిలిచిన నాయకులు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని పేర్కొన్నారు. మండలంలోని ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని, ప్రజలకు ఎల్లప్పుడూ అందు బాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మరడాన నారాయణస్వామి హామీ ఇచ్చారు.