BREAKING
బుచ్చిలో పలు వార్డులలో శంకుస్థాపనలు చేసిన ఎంపి, ఎమ్మెల్యే ఉచిత కంటి వైద్య శిబిరం సోమిరెడ్డి అవినీతిని అడ్డుకుంటున్న తెలుగు తమ్ముళ్లు" సాగునీటి వ్యవస్థను గాడిలో పెట్టిన కూటమి ప్రభుత్వం నంద్యాలలో భగత్ సింగ్ జయంతి వేడుకలు ఓట్ల చోరీకి నిరసనగా సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ ఆందోళన.. కాలువలు, డ్రెయిన్లు, రిజర్వాయర్ల నిర్వహణకు రూ.160 కోట్ల బిల్లుల విడుదల తగ్గిన పసిడి ధర.... వెండి కూడా అదే బాటలో.. అర్ధరాత్రి భారీ శబ్దాలతో లౌడ్‌స్పీకర్లు: పోలీసులకు నటుడు అల్లు శిరీష్ ఫిర్యాదు.. నంద్యాలలోని నూనెపల్లె అభివృద్ధిపై రిలే దీక్షలు తెలంగాణలో ముగిసిన నైరుతి రుతుపవనాల సీజన్ ఆదివాసీ మహిళల స్వయం ఉపాధికి అండగా ఉంటాం: ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హైదరాబాద్ మెట్రో విస్తరణను కాంగ్రెస్ అటకెక్కించింది: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ధ్వజం హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు బ్యాంకులు తెరిచే ఉంటాయి

జిల్లా ప్రజా పరిషత్తులు, మండల ప్రజా పరిషత్తుల పదవీకాలం ముగిసేనా..?

Select Suryaa Now
జిల్లా ప్రజా పరిషత్తులు, మండల ప్రజా పరిషత్తుల పదవీకాలం ముగిసేనా..?

జిల్లా ప్రజా పరిషత్తులు, మండల ప్రజా పరిషత్తుల పదవీకాలం ముగిసేనా..?

 జంగారెడ్డిగూడెం,మేజర్ న్యూస్:-

 రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం నూతనంగా రాష్ట్రంలో జిల్లాలను విభజించింది. దానిలో భాగంగానే జిల్లా పరిషత్ జడ్పిటిసిలు జడ్పీ చైర్మన్లు పదవీకాలం ఈనెల 24వ తేదీతో ముగిసింది. దీంతో నూతనంగా మరికొన్ని జిల్లా పరిషత్ రాష్ట్రంలో ఏర్పడ్డాయి. 25వ తేదీన ఆయా జిల్లా పరిషత్తులకు స్పెషల్ ఆఫీసర్లను పరిపాలన అధికారులు గా నియమించింది. ఏలూరు జిల్లా పరిషత్ కు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి 25వ తేదీన స్పెషల్ ఆఫీసర్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇదిలా ఉండగా జంగారెడ్డిగూడెం మండల ప్రజాపరిషత్తులోని ఎంపీటీసీలు, డిప్యూటీ ఎంపీటీసీలు, ఎంపీపీ ల పదవీకాలం ఈనెల 23వ తేదీతో పూర్తయింది. అనంతరం జడ్పిటిసి పదవీకాలం 24వ తేదీతో ముగిసింది. ఎంపీపీ స్థానే 24వ తేదీన స్పెషల్ ఆఫీసర్గా డిడిఓ ఎం. రాజు పదవి బాధ్యతలు స్వీకరించారు. అయినప్పటికీ జంగారెడ్డిగూడెం మండల ప్రజా పరిషత్ కార్యాలయం వారు స్థానిక అశ్వారావుపేట రోడ్డులో గల మండల పరిషత్ కార్యాలయం బోర్డును అలాగే ఉంచారు. సుస్వాగతం అంటూ ఏర్పాటు చేసిన ఈ బోర్డులో పదవీకాలం పూర్తయి మాజీ లైన ఎంపీపీ కొదమజ్యోతి, జడ్పిటిసి పోల్నాటి బాబ్జిల ఫోటోలతో  ఆ బోర్డును అలాగే ఉంచారు.  ఏలూరు జిల్లాలో ఈ విధంగా మరిన్ని బోర్డులు ఉన్నాయో జడ్పీ స్పెషల్ ఆఫీసర్ అయిన జిల్లా కలెక్టర్ పరిశీలించి బోర్డులు మార్చడానికి ఆదేశాలు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.

 

 కెవి రమణ రావు జంగారెడ్డిగూడెం