BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026 శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి

జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆయుధపూజ : హాజరైన ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

Select Suryaa Now
జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆయుధపూజ : హాజరైన ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

మదనపల్లె,మేజర్ న్యూస్ : అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లి పట్టణంలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం దసరా పర్వదినం సందర్భంగా ఆయుధపూజ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు.జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆయుధాలు,పోలీసు వాహనాలకు స్వయంగా పూజలు చేసి,సిబ్బందికి ఎలాంటి అపాయాలు కలుగకుండా సురక్షితంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.దసరా చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని పేర్కొన్న ఎస్పీ జిల్లా ప్రజలకు,పోలీసు కుటుంబాలకు,మీడియా ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి,పలువురు సీఐలు,రిజర్వ్ ఇన్స్పెక్టర్లు,ఇతర పోలీసు అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి