జవహర్ నవోదయ లో ఘనంగా ముగిసిన కళా ఉత్సవాలు
జవహర్ నవోదయ లో ఘనంగా ముగిసిన కళా ఉత్సవాలు
ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి
స్థానిక జవహర్ నవోదయ విద్యాలయంలో రెండు రోజులుగా నిర్వహించిన క్లస్టర్ స్థాయి ‘ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్’ (కళా ఉత్సవ్) పోటీలు ఘనంగా ముగిశాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 21 జవహర్ నవోదయ విద్యాలయాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
వోకల్, ఇన్‌స్ట్రుమెంటల్, 2డీ, 3డీ ఆర్ట్, స్టోరీ టెల్లింగ్, ఇండిజినస్ టాయ్స్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించగా విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. ముఖ్య అతిథి డా. పాల్ దేవానందం మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని క్రమశిక్షణ, పట్టుదలతో వాటిని సాధించాలని సూచించారు.
ప్రిన్సిపాల్ ఇ. పద్మావతి మాట్లాడుతూ కళలు విద్యార్థుల సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాల అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి విద్యార్థి తన ప్రతిభను ప్రదర్శించడమే నిజమైన విజయమన్నారు.
వివిధ రంగాల కళా నిపుణులు, సంగీత విద్వాంసులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు.