జనసేన పార్టీలో చేరిన వడ్డీవారి పాలెం మాజీ సర్పంచ్
రేపల్లె మేజర్ న్యూస్; మండలం వడ్డివారిపాలెం గ్రామానికి చెందిన సీనియర్ రాజకీయవేత్త మాజీ సర్పంచ్ వడ్డీ శ్రీనివాసరావు జనసేన పార్టీ రేపల్లె నియోజకవర్గం సమన్వయకర్త కమతం సాంబశివరావు సమక్షంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.రేపల్లె జనసేన పార్టీ కార్యాలయంలో సాంబశివరావు ఆయనకు పార్టీ కండువా వేసి స్వాగతించారు.ఈ సందర్భంగా వడ్డీ శ్రీనివాసరావును ఉద్దేశించి కమతం సాంబశివరావు మాట్లాడుతూ రాజకీయ కుటుంబంలో పుట్టిపెరిగి మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్న వడ్డే శ్రీనివాసరావు జనసేన పార్టీలోకి రావడం ఎంతో సంతోషదాయకమని ఆయనను అభినందించారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రేపల్లె అధ్యక్షులు రాసంశెట్టి మహేష్,నగరం మండల అధ్యక్షుడు గోపరాజు ఉదయ్ కృష్ణ,రేపల్లె బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు గరికపాటి వెంకటగిరిధర్,కోట శ్రీనివాసరరావు, నియోజకవర్గ సమన్వయకర్త కొండవీటి యువకిషోర్,విద్యావేత దండా శ్రీనివాసరావు,రేపల్లె రూరల్ మండలం అధ్యక్షుడు రేపల్లె జానకిరామయ్య తదితరులు పాల్గొన్నారు .