BREAKING
పట్టభద్రుల ఓటు నమోదుపై కాంగ్రెస్ అవగాహన.. అర్హులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలి: కర్రె రాజేష్ యాదవ ప్రముఖులకు, వివాహ ఆహ్వాన పత్రికలు అందించిన చిత్తారు సింహాద్రి యాదవ్ మేకల మల్లిబాబు యాదవ్ --ప్రముఖులు తలసాని, బీర్ల ఐలయ్య,నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్ లను ఆహ్వానించిన సింహాద్రి యాదవ్, మేకల మల్లిబాబు యాదవ్ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించాలి.. - అడిషనల్ డీఆర్డీఓ మల్లేశం స్వర్ణగిరి కాలనీలో సెప్టిక్ ట్యాంక్ స్థలానికీ ఎసరు.. అధికారుల పర్యవేక్షణ ఏది..? కరువు రైతులకు రుణ ఉపశమనం కల్పించాలి విజేతలకు శుభాకాంక్షలు... అర్హులైన పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి: ఎమ్మెల్సీ అభ్యర్థి పట్లోళ్ల అమరేందర్ రెడ్డి పొగాకుకు దూరంగా ఉండాలి గుర్తు తెలియని వాహనం డీకొని వ్యక్తి మృతి ​ ఎస్సీ హాస్టల్ విద్యార్థుల తాగునీటి కష్టాలకు చెక్.. నూతన బోర్‌వెల్ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ​సింహగిరిపై భక్తులకు సాంప్రదాయ దుస్తుల నియమావళి తప్పనిసరి * ఇఓ జల్లేపల్లి వెంకట్రావు * నిఘా నీడలో ఓట్ల లెక్కింపు. ఏర్పాట్లు పూర్తి. ఆర్ ఓ వెంకటరెడ్డి కౌంటింగ్ కు పటిష్ట బందోబస్తు ట్రాఫిక్ మళ్లింపు పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించాలి ఆధునిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకొని జీవితంలో ఎదగండి ---ఎయిడ్ సేవా సంస్థ జిల్లా కోఆర్డినేటర్ కే శ్రీనివాస్

జగదాంబ క్లాక్ టవర్‌కు కాలం చెల్లిందా?

Select Suryaa Now
జగదాంబ క్లాక్ టవర్‌కు కాలం చెల్లిందా?

విశాఖపట్నం, సూర్య : నగరంలో అత్యంత రద్దీగా ఉండే జగదాంబ జంక్షన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలవాల్సిన క్లాక్ టవర్ ప్రస్తుతం నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారింది. సుమారు రూ.2 కోట్లకు పైగా ప్రజాధనం వెచ్చించి నిర్మించిన ఈ క్లాక్ టవర్‌లో గడియారం గత మూడు, నాలుగు నెలలుగా పనిచేయడం లేదు. గంటలు మోగడం ఎప్పుడో ఆగిపోగా, ఇప్పుడు సమయం చూపించే గడియారాలు సైతం నిలిచిపోవడం జీవీఎంసీ నిర్వహణ తీరుపై తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

జగదాంబ జంక్షన్‌కు వచ్చే ప్రజలు, వ్యాపారులు ఒకప్పుడు తమ చేతి గడియారాలు, మొబైల్ ఫోన్ల సమయాన్ని క్లాక్ టవర్‌తో సరిచూసుకునేవారు. ఉదయం దుకాణాలు తెరిచే సమయం నుంచి రాత్రి మూసే వరకు వ్యాపారులకు ఈ గడియారమే సమయ సూచికగా ఉండేది. అలాంటి క్లాక్ టవర్ ఇప్పుడు కాలం ఆగిపోయిన చిహ్నంగా మిగిలిపోయింది.

నాలుగు వైపులా భారీ గడియారాలు, జీపీఎస్ ఆధారిత సాంకేతిక వ్యవస్థ, ప్రతి గంటకు గంట మోగే ప్రత్యేక ఏర్పాటు అంటూ నిర్మాణ సమయంలో అధికారులు గొప్పగా ప్రచారం చేశారు. కానీ ఆర్భాటంగా ప్రారంభించిన ఈ గడియారం నిర్వహణ విషయంలో మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రారంభమైన కొద్ది రోజులకే గంటల శబ్దం నిలిచిపోగా, ప్రస్తుతం సమయం కూడా చూపించలేని దుస్థితి నెలకొంది. క్లాక్ టవర్ నిర్వహణ బాధ్యతల విషయంలోనూ స్పష్టత లేకపోవడం, పర్యవేక్షణ కొరవడటం పరిస్థితిని మరింత దిగజార్చిందని స్థానిక వ్యాపారులు విమర్శిస్తున్నారు.