జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పోలింగ్ కేంద్రాల పరిశీలన
కడియం, మేజర్ న్యూస్ ,:కడియం మండలంలో జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సోమవారం కడియపుసావరం, మాధవరాయుడుపాలెం గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎన్. మల్లికార్జునరావు, తహశీల్దార్ ఎం. శ్రీనివాసరావు సంయుక్తంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి ఎన్. మల్లికార్జునరావు, తహశీల్దార్ ఎం. శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా సమన్వయంతో పనిచేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న వసతులను పరిశీలించి, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ప్రతి అధికారి తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని పేర్కొన్నారు.ఈ పరిశీలన కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.