జడ్పీ హైస్కూల్లో అయోడిన్ లోపంపై అవగాహన.
ముత్తుకూరు, మేజర్ న్యూస్ : అయోడిన్ లోపంపై మంగళవారం మండల కేంద్రం జడ్పీ హైస్కూల్లో వైద్య ఆరోగ్యశాఖ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దేవి కృప మాట్లాడారు.అయోడిన్ వాడకం తగ్గినప్పుడుశరీరంలో అయోడిన్ లోపంఏర్పడిఅనేకరకాలజీవక్రియలు ముందగిస్తాయని తెలిపారు. అయోడిన్ మూలకం సమృద్ధిగా శరీరంలో ఉంటే శారీరక ఎదుగుదల మానసిక ఉల్లాసం జ్ఞాపకశక్తి ప్రధానంగా పెరుగుతుందన్నారు. శరీరంలో అయోడిన్ లోపిస్తే ఎదురయ్యే అనారోగ్య సమస్యలు కూలంకషంగా వివరించారు. ప్రధానంగా థైరాయిడ్ సమస్యలు ఉత్పన్నం అవుతాయన్నారు. అయోడిన్ కలిగిన కల్లు ఉప్పు వాడకం చేపట్టాలన్నారు. దీనితో పాటు సముద్ర చేపలు, కోడిగుడ్డులు ఆహారంలో చేరిస్తే అదనపు ప్రయోజనాలుచేకూరుతాయన్నారు. కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చల్లా శ్రీనివాసులు రెడ్డి, ఆరోగ్య పర్యవేక్షకులు మార్క్, బూదూరు బాలకృష్ణ, ఎ. ఎన్. ఎమ్ పెంచలమ్మ, ఎమ్.ఎల్. హెచ్.పి. లూసి ప్రియ, ఆశ కార్యకర్త మస్తానమ్మ పాల్గొన్నారు.