BREAKING
ఏపీఎస్ఈఏ అనంతపురం జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన నల్లపల్లి విజయభాస్కర్ సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలో పాల్గొన్నారు : మహేంద్ర యాలాల పోలీస్ స్టేషన్‌లో ఘనంగా ఆయుధ పూజలు మలక్‌పేటలో జింక మాంసం కలకలం.. ముగ్గురు అరెస్ట్ రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి కొద్దిసేపట్లో స్వగ్రామానికి సీఎం రేవంత్‌రెడ్డి రాక సీఎం రేవంత్ రెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపిన పీసీసీ అధ్యక్షుడు చీరాల టీడీపీ క్యాంపు కార్యాలయంలో దసరా వేడుకలు సీఈసీ దిష్టిబొమ్మ దహనం: ఢిల్లీలో యూత్ కాంగ్రెస్ వినూత్న నిరసన చెడుపై మంచి విజయం.. భక్తిశ్రద్ధలతో వత్సవాయి పోలీస్‌స్టేషన్‌లో దసరా వేడుకలు! పాఠశాల నిర్మాణానికి భూమి పూజ దసరా పండుగ సందర్భంగా మల్టీ పర్పస్ వర్కర్లకు నూతన వస్త్రాల పంపిణీ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ ఆలూరు సాంబ శివారెడ్డిని కలిసిన వైసీపీ మేయర్ అభ్యర్థి సి. రమేష్ గౌడ్ మేయర్ ఎన్నికల్లో సహకారం కోరిన రమేష్ గౌడ్.. నగర అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి దసరా సందర్భంగా తిమ్మారెడ్డిపల్లిలో జెండా ఆవిష్కరణ

ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ

Select Suryaa Now
ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ

ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల చివరి రోజైన మంగళవారం ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ భారీగా పెరిగింది. సాధారణ భక్తులతో పాటు భవానీమాలధారులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో కొండపై సందడి నెలకొంది. శ్రీ కనకదుర్గమ్మ దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు ప్రభుత్వం, దేవస్థానం, జిల్లా యంత్రాంగం సమన్వయంతో తాగునీరు, క్యూలైన్ల నిర్వహణ, పారిశుద్ధ్యం, భద్రతకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాయి. దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్, ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు, దేవస్థానం ఈవో వి.కె. శీనా నాయక్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్.ఎం. ధ్యానచంద్ర తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. రద్దీ అధికంగా ఉన్నప్పటికీ సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయడంతో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం లభించిందని పలువురు సంతృప్తి వ్యక్తం చేశారు. నవరాత్రి ఉత్సవాల ముగింపు వేళ భవానీల రాకతో ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.


స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.