BREAKING
అమ్మవారి ని దర్శించుకున్న కలెక్టర్ దంపతులు ఏపీఎస్ఈఏ అనంతపురం జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన నల్లపల్లి విజయభాస్కర్ సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలో పాల్గొన్నారు : మహేంద్ర యాలాల పోలీస్ స్టేషన్‌లో ఘనంగా ఆయుధ పూజలు మలక్‌పేటలో జింక మాంసం కలకలం.. ముగ్గురు అరెస్ట్ రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి కొద్దిసేపట్లో స్వగ్రామానికి సీఎం రేవంత్‌రెడ్డి రాక సీఎం రేవంత్ రెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపిన పీసీసీ అధ్యక్షుడు చీరాల టీడీపీ క్యాంపు కార్యాలయంలో దసరా వేడుకలు సీఈసీ దిష్టిబొమ్మ దహనం: ఢిల్లీలో యూత్ కాంగ్రెస్ వినూత్న నిరసన చెడుపై మంచి విజయం.. భక్తిశ్రద్ధలతో వత్సవాయి పోలీస్‌స్టేషన్‌లో దసరా వేడుకలు! పాఠశాల నిర్మాణానికి భూమి పూజ దసరా పండుగ సందర్భంగా మల్టీ పర్పస్ వర్కర్లకు నూతన వస్త్రాల పంపిణీ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ ఆలూరు సాంబ శివారెడ్డిని కలిసిన వైసీపీ మేయర్ అభ్యర్థి సి. రమేష్ గౌడ్ మేయర్ ఎన్నికల్లో సహకారం కోరిన రమేష్ గౌడ్.. నగర అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి

చెడుపై మంచి విజయం.. భక్తిశ్రద్ధలతో వత్సవాయి పోలీస్‌స్టేషన్‌లో దసరా వేడుకలు!

Select Suryaa Now
చెడుపై మంచి విజయం.. భక్తిశ్రద్ధలతో వత్సవాయి పోలీస్‌స్టేషన్‌లో దసరా వేడుకలు!

 వత్సవాయి పోలీస్‌స్టేషన్‌లో దేవీ నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ప్రత్యేక పూజలు, సంప్రదాయ కోలాటాలు, డప్పు కళాకారుల ప్రదర్శనలతో పోలీస్‌స్టేషన్‌ ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. వత్సవాయి ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని పోలీసు సిబ్బంది సంప్రదాయబద్ధంగా అతిథులకు స్వాగతం పలికారు. కోలాటాలు, డప్పు కళాకారుల ప్రదర్శనలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు, ఆయన కుటుంబ సభ్యులు, పోలీసు సిబ్బంది అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. చెడుపై మంచి విజయం సాధించిన సందర్భంగా దసరా పండుగను జరుపుకుంటామని తెలిపారు. మండల ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, యువత చెడు ప్రవర్తనలకు దూరంగా ఉంటూ మంచి మార్గంలో నడవాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు. మండల ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.భక్తి భావం, సంప్రదాయ కళారూపాల సమ్మేళనంగా వత్సవాయి పోలీస్‌స్టేషన్‌లో దేవీ నవరాత్రి వేడుకలు వైభవంగా ముగిశాయి.