ఏపీఎస్ఈఏ అనంతపురం జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన నల్లపల్లి విజయభాస్కర్
అనంతపురం మేజర్ న్యూస్ ప్రతినిధి:-ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అనంతపురం జిల్లా కార్యాలయాన్ని నగరంలో రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయభాస్కర్ ప్రారంభించారు. ఈ కార్యాలయం ఉద్యోగుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ, సంక్షేమానికి వేదికగా నిలవనుంది. ఉద్యోగుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, వారి న్యాయమైన హక్కుల సాధనకు కృషి చేయనుంది. ఉద్యోగుల ఐక్యతను బలోపేతం చేస్తూ, అసోసియేషన్ లక్ష్యాల సాధనలో ఈ కార్యాలయం కీలక పాత్ర పోషిస్తుందని నాయకులు ఆకాంక్షించారు. జిల్లా కార్యాలయం ప్రారంభం పట్ల అసోసియేషన్ నాయకులు, సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
( మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్ )