BREAKING
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణం విజయదశమి సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ అమ్మవారి ని దర్శించుకున్న కలెక్టర్ దంపతులు ఏపీఎస్ఈఏ అనంతపురం జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన నల్లపల్లి విజయభాస్కర్ సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలో పాల్గొన్నారు : మహేంద్ర యాలాల పోలీస్ స్టేషన్‌లో ఘనంగా ఆయుధ పూజలు మలక్‌పేటలో జింక మాంసం కలకలం.. ముగ్గురు అరెస్ట్ రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి కొద్దిసేపట్లో స్వగ్రామానికి సీఎం రేవంత్‌రెడ్డి రాక సీఎం రేవంత్ రెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపిన పీసీసీ అధ్యక్షుడు చీరాల టీడీపీ క్యాంపు కార్యాలయంలో దసరా వేడుకలు సీఈసీ దిష్టిబొమ్మ దహనం: ఢిల్లీలో యూత్ కాంగ్రెస్ వినూత్న నిరసన చెడుపై మంచి విజయం.. భక్తిశ్రద్ధలతో వత్సవాయి పోలీస్‌స్టేషన్‌లో దసరా వేడుకలు! పాఠశాల నిర్మాణానికి భూమి పూజ

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

Select Suryaa Now
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ప్రొద్దుటూరు మేజర్ న్యూస్: ప్రొద్దుటూరు పట్టణంలోని కొర్రపాడు రోడ్డులో మంగళవారం  రోడ్డు ప్రమాదం జరిగింది. R&B గెస్ట్ హౌస్ ఎదురుగా ట్రాక్టర్ ఢీకొట్టిన ఘటనలో ప్రణీత్ కుమార్ అనే యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రణీత్ కుమార్, తన బావ సుమంత్ కుమార్‌తో కలిసి టీవీఎస్ జూపిటర్ బైక్ (AP 40 CX 5068) పై కొర్రపాడు రోడ్డు వైపు వెళ్తున్నారు. ఆ సమయంలో సుమంత్ కుమార్ బైక్ నడుపుతుండగా, ప్రణీత్ కుమార్ వెనుక కూర్చున్నాడు. ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ వద్దకు రాగానే, ఒక ట్రాక్టర్ (AP 39 NQ 6312) దానిని అతివేగంగా, అజాగ్రత్తగా వెళ్తూ, ఆకస్మాత్తుగా దానిని తిప్పగా ట్రాక్టర్ ట్రాలీ  స్కూటీని తగలగా స్కూటీ లో వెళ్తున్న ప్రణీత్, సుమంత్ ఇరువురు క్రింద పడ్డారు వెనుక కూర్చొని ఉన్న ప్రణీత్ ట్రాలీ టైర్ల కింద పడగా ఆయన తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు వెంటనే స్పందించి, బాధితుడిని చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ  ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ  ప్రణీత్ కుమార్ మృతి చెందారు. ఘటనపై సమాచారం అందుకున్న ప్రొద్దుటూరు ట్రాఫిక్ సిఐ ఆసుపత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. ట్రాఫిక్ సీఐ ఎన్. భాస్కర్ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.  ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా గుర్తించారు.

  • షేక్ మహమ్మద్ రఫీ ప్రొద్దుటూరు వైఎస్సార్ కడప జిల్లా