ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం
తిరుపతి రేణిగుంట మేజర్ న్యూస్: రెండో సాధారణ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఈరోజు సమావేశం నిర్వహించనున్నారు. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ), అదనపు జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది. తిరుపతి కలెక్టరేట్‌లోని వీసీ సమావేశ మందిరంలో నిర్వహించే ఈ సమావేశంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు.