వెల్దుర్తిలో ఘనంగా జమ్మి చెట్టు ప్రతిష్టాపన
వెల్దుర్తి, సూర్య ప్రతినిధి మేజర్ న్యూస్:స్థానిక జర్నలిస్టు కాలనీలో వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, శ్రీ సద్గురు సాయినాథ అయ్యప్ప స్వామి, శ్రీ కేదారేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నూతన జమ్మి చెట్టు ప్రతిష్టా కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. ఆలయ పురోహితుడు యార్లపాటి శ్రీధర్ శర్మ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి శమీ వృక్షాన్ని ప్రతిష్టించారు.ఈ కార్యక్రమానికి ప్రముఖ పారిశ్రామికవేత్త తిరువీధి రమేష్ శెట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ పురోహితులు భక్తులకు శమీ వృక్ష విశిష్టతను, ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా తిరువీధి రమేష్ శెట్టి మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో శమీ వృక్షాన్ని ఏర్పాటు చేయడం, ఆ మహత్కార్యంలో తాను భాగస్వామి కావడం పూర్వజన్మ సుకృతమని, ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. అనంతరం వెల్దుర్తి పట్టణ ప్రజలకు ఆయన దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అభయాంజనేయ స్వామి విగ్రహ ఏర్పాటుకర్త గురుస్వామి రామాంజనేయులు, టీవీఎస్ షోరూమ్ అధినేత బాలు, నాగేశ్వర్ రెడ్డి, వాల్మీకి సంఘం నాయకులు భాస్కర్ నాయుడు, రత్నపల్లి రామకృష్ణతో పాటు ఆలయ కమిటీ సభ్యులు చిరంజీవి, మధు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సూర్య ప్రతినిధి షేక్ దస్తు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం