ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ
అనకాపల్లి జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ యలమర్తి నరసింగరావు మాట్లాడుతూ బియ్యం, పప్పులు , సేమియా, నూని, గోధుమ నూక మొదలైన 26 రకాల నిత్యవసర సరుకులను అతి నిరుపేద ఆర్యవైశ్యులు 14 మందికి పంపిణీ చేశామని అన్నారు. ఈరోజు ప్రారంభమైన ఈ నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమం ప్రతినెల ఇస్తామని అన్నారు. దాతల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం చేశామని అన్నారు. సెక్రెటరీ తమ్మన సుబ్రహ్మణ్య గుప్తా మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అనకాపల్లి రాజా ఆప్టికల్స్ అండ్ కంటి ఆసుపత్రి సహకారంతో ఉచిత కంటి శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని అలాగే దాతల సహాయ సహకారాలతో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టామని అన్నారు. ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, మాజీ మంత్రి టి జి వెంకటేష్, రాష్ట్ర అధ్యక్షులు ఇల్లూరి లక్ష్మయ్య సలహా సూచనల మేరకు ఇంకా అనేక సేవా కార్యక్రమాలు ఈ ఆర్యవైశ్య మహాసభ ద్వారా చేస్తామని తెలిపారు. దాతల సహాయ సహకారాలతో సంఖ్యను పెంచే కార్యక్రమం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో దాతలకు కమిటీ వారు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ యలమర్తి నర్సింగరావు, సెక్రటరీ తమ్మన సుబ్రమణ్య గుప్తా, ట్రెజరర్ గుండా రమేష్ గుప్తా, వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్టా మోహన్రావు, వైస్ ప్రెసిడెంట్ లు కటకo లక్ష్మణరావు పోలిశెట్టి అయ్యప్ప, జాయింట్ సెక్రటరీ లు విజ్జపు మల్లేశ్వరరావు, పల్లపోతు సంతోష్ కుమార్, జిల్లా పీఆర్ఓ నేతి నాగ వర ప్రసాద్, జిల్లా మీడియా చైర్మన్ పూసర్ల రాజా, జిల్లా గౌరవ సలహాదారులు నుదురుపాటి తాతాజీ, ప్రోగ్రాం చైర్మన్ లు విజ్జపు మల్లేశ్వరరావు, నేతి నాగ వర ప్రసాద్, కె వి సత్యనారాయణ ఆర్యవైశ్య పెద్దలు కడిమిశెట్టి సతీష్, అర్రేపు కామేశ్వరరావు, అనకాపల్లి మండల అధ్యక్ష కార్యదర్శులు అర్రేపు కాసన్న, కొల్లూరు సాయి కిషోర్ కోశాధికారి గ్రంధి శ్రీనివాస్ రావు మరియు స్థానిక ఆర్యవైశ్య సభ్యులు, పాల్గొన్నారు.
రవికుమార్
జిల్లా ఇంచార్జ్
అనకాపల్లి