BREAKING
ప్రధాని నివాసం సమీపంలోని చారిత్రక రేస్ కోర్స్ మసీదుకు ఎవిక్షన్ నోటీసు: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు జోక్యాన్ని కోరిన అసదుద్దీన్ ఒవైసీ! చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా.. డాక్టర్ గడల శ్రీనివాసరావు కస్టడీ పొడిగింపుపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా: ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఉత్తర్వుల సవాలు! గుజరాత్‌లో నాలుగు ఘోర రోడ్డు ప్రమాదాలు: విధుల్లో ఉన్న పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ సహా 11 మంది దుర్మరణం! గ్రేటర్ నోయిడాలో 19వ రెన్యూవబుల్ ఎనర్జీ ఇండియా ఎక్స్‌పో: 1,080 మంది ఎగ్జిబిటర్లతో స్వచ్ఛ ఇంధన సాంకేతికతల ప్రదర్శన! ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణతో కాంగ్రెస్ బెంబేలు: బీజేపీ నేత శ్రీకాంత్ శర్మ తీవ్ర వ్యాఖ్యలు! పలమనేరు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ 33 వార్డుల్లో పోటీ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో మరో కీలక ఘట్టం: 5వ యూనిట్ ట్రయల్ రన్ విజయవంతం వెల్దుర్తి మండల అభివృద్ధికి సుబ్బారాయుడు కుటుంబం కృషి అభినందనీయం ముంబైలోని చారిత్రక గేట్‌వే ఆఫ్ ఇండియాను సందర్శించిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో: 26/11 అమరులకు నివాళి! శ్రీకాకుళం బీచ్‌లో తీవ్ర విషాదం: స్నానానికి వెళ్ళి నలుగురు గల్లంతు కృష్ణానదిలో వైభవంగా దుర్గమ్మ తెప్పోత్సవం: హంస వాహనంపై భక్తులకు అభయమిచ్చిన దుర్గామల్లేశ్వరులు 34వ డివిజన్‌లో సరిపూటి రమణ ప్రచార హోరు.. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థన.. బైరాగి గూడా లో ఘనంగా దసరా వేడుకలు దుర్గామాత సేవలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సంజీవరెడ్డి

కడప కూటమి మేయర్ అభ్యర్థికి బీఫామ్ అందజేసిన ఎమ్మెల్యే

Select Suryaa Now
కడప కూటమి మేయర్ అభ్యర్థికి బీఫామ్ అందజేసిన ఎమ్మెల్యే

కడప కూటమి మేయర్ అభ్యర్థి మట్లి సువర్ణ కు ‘బి-ఫామ్’ అందజేసిన కడప ఎమ్మెల్యే 

 కడప, ప్రతినిధి, వేణు.

కడప నగరంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కూటమి తరఫున మేయర్ అభ్యర్థిగా ఎంపికైన మట్లి సువర్ణ కు,  కడప శాసనసభ్యురాలు శ్రీమతి రెడ్డెప్పగారి మాధవి మంగళవారం అధికారికంగా ‘బి-ఫామ్’ అందజేశారు. అనంతరం ఆమెకు శుభాకాంక్షలు తెలిపి ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా మేయర్ అభ్యర్థి మట్లి సువర్ణ  మాట్లాడుతూ, కడప నగర అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని స్పష్టం చేశారు. గత పాలకుల నేర సంస్కృతి, అరాచకాల నుంచి విముక్తి కల్పించి, నగరంలో శాంతిభద్రతలను కాపాడటమే తమ ప్రథమ కర్తవ్యమన్నారు. కడపను సమగ్రంగా అభివృద్ధి చేసి, సుందర నగరంగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు.ప్రజల మద్దతుతో కూటమి అభ్యర్థి మట్లి సువర్ణ  భారీ మెజారిటీతో విజయం సాధించబోతున్నారని, నగర ప్రజలంతా అభివృద్ధి వైపు నిలబడి కూటమి అభ్యర్థిని గెలిపించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్పొరేటర్ అభ్యర్థులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.