BREAKING
19 ఎంపీటీసీ స్థానాలకు కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియ.. వైభవంగా దుర్గ మాత ఊరేగింపు ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి జిల్లా ఎన్నికల పరిశీలకుడు కన్నబాబు అభ్యర్థులకు తెలియకుండానే ఇద్దరు వైసిపి నామినేషన్ల ఉపసంహరణ రెండు రోజులుగా తాగునీటి కరువు! ట్యాంకర్ల ద్వారా కూడా నీరు సరఫరా చేయలేని పరిస్థితి.. ప్రజల ఇబ్బందులు పట్టించుకునేదెవరు? ఏ. నారాయణపురము 2 ఎంపీటీసీ స్థానానికి జనసేన అభ్యర్థి కే లాలు స్వామి నామినేషన్ నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు – ఏఎస్పీ సౌజన్య కోనంకి వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా జొన్నలగడ్డ రేణుకాదేవి తొలి నామినేషన్ బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు  ఆస్కార్ రేసులో నిలిచిన కొరియన్ మూవీ పాసిబుల్ లవ్ ఫైనల్ ట్రైలర్ రిలీజ్ మామదాపూర్‌లో ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాల ముగింపు పాలకోడేరు జడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా చింతలపాటి శివ నాగరాజు నామినేషన్ టీడీపీలో సుదీర్ఘకాలంగా అందించిన సేవలకు గుర్తింపుగా అవకాశం అశ్వారావుపేట మండలంలో ఇంటర్ విద్యార్థిని అదృశ్యం — పోలీసుల దర్యాప్తు కోహీర్ మండల సేవాదళ్ అధ్యక్షులు శ్రీనివాస్ నామినేషన్లను అడ్డుకోవడం ప్రజాస్వామ్యంపై దాడే! డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజం

ఘనంగా ఆయుధ పూజ

Select Suryaa Now
ఘనంగా ఆయుధ పూజ

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : విజయదశమిని పురస్కరించుకుని ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ.శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై  ఆయుధ పూజలు పాల్గొని టాస్క్ ఫోర్స్ ఎర్రచందనం పరిరక్షణలో ఉపయోగించే ఆయుధాలు, కార్లు, ఇతర సామగ్రికి పూజలు చేపట్టారు. ఆయుధాలు కలిగిన స్టోర్ రూమ్, ఎస్పీ కార్యాలయం, టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ లలో పూజారి వేద మంత్రోచ్ఛారణల మధ్య పూజ కార్యక్రమాలు నిర్వహించారు. విధి నిర్వహణలో తమకు ఎలాంటి ఆటంకాలు లేకుండా, శక్తిని ప్రసాదించాలని దుర్గామాతను వేడుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ పీ. శ్రీనివాస్ మాట్లాడుతూ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దసరా పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికీ విజయాలు కలగాలని, వారి జీవితాలలో ఆటంకాలు లేకుండా ముందుకు పోవాలని ఆకాంక్షించారు.డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి, ఎండీ షరీఫ్, ఏసీఎఫ్ జె. శ్రీనివాస్, సీఐ ఖాదర్ బాషా, ఆర్ఎస్ఐ విష్ణు వర్ధన్ కుమార్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్