BREAKING
ఐడి కార్డులు పంపిణీ చేసిన వైసిపి మండల అధ్యక్షులు కొత్త గూడ ఘనంగా విజయదశమి వేడుకలు స్వగ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి దసరా వేడుకలు , కొండారెడ్డిపల్లిలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు.. జెమ్మి చెట్టుకు శాస్త్రోక్తంగా పూజలు కల్వకుర్తి దసరా వేడుకల్లో సీఎం రేవంత్‌ రెడ్డి.. రావణ దహనం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఘనంగా దేవీ నవరాత్రులు ఈటల రాజేందర్ నివాసంలో ఘనంగా విజయదశమి వేడుకలు వైయస్సార్సీపి జడ్పీటీసీ అభ్యర్థిగా బోల్లెద్దు ప్రతాప్ కుమార్ -ప్రకటించిన వరికూటి భూమా నంద ఆశ్రమంలో వైభవంగా దుర్గమ్మ వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం. వికసిత్‌ భారత్ లక్ష్య సాధనలో శ్రీరాముడి స్ఫూర్తిని పొందాలి గ్రామపంచాయతీ సిబ్బందికి దుస్తుల పంపిణీ ఇల్లందులో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన- సబ్ రిజిస్టర్ కార్యాలయానికి శంకుస్థాపన, స్టేడియం, ఈనెల 26న చలో హైదరాబాద్ కు వేలాదిగా తరలి రండి షాద్‌నగర్ 18వ వార్డులో ఘనంగా జమ్మి పూజ, రావణ దహనం.... స్థానిక ఎన్నికల వేళ వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు వైభవంగా బిజినేపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామం లో శమి పూజలు...దసరా వేడుకలు...

ఇంటిపై టి.డి.పి గుండాలదాడి నామినేషన్ తిరస్కరించడంపై పోరెడ్డిని కలిసి రెడ్యం

Select Suryaa Now
ఇంటిపై టి.డి.పి గుండాలదాడి నామినేషన్ తిరస్కరించడంపై పోరెడ్డిని కలిసి రెడ్యం

ఇది టి.డి.పి నీచ రాజకీయానికి పరాకాష్ట : రెడ్యం

ప్రొద్దుటూరు మేజర్ న్యూస్: వైఎస్ఆర్ సీపీ ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పోరెడ్డి  నరశింహారెడ్డిని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి మంగళవారం పొద్దుటూరులోని వారి స్వగృహంలో కలిశారు. పోరెడ్డి ఇంటిపై టి.డి.పి గూండాలు దాడి చేయడం పై, పోరెడ్డి అన్ని పత్రాలతో నామినేషన్ వేసినా ప్రభుత్వ ఒత్తిడితొ అక్రమంగా తొలగించడం పై పొరెడ్డి ని రెడ్యం కలిసి జరిగిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. దీనిని  రెడ్యం తీవ్రంగా  ఖండించారు. తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఇది టి.డి.పి నీచరాజకీయానికి పరాకాష్ట అని రెడ్యం తీవ్రంగా ఖండించారు. అనంతరం పోరెడ్డి స్వగృహంలో ఉన్న వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ శాసన సభ్యుడు రాచమల్లు ప్రసాద్ రెడ్డి తో కూడా  రెడ్యం చర్చించారు. ఈ కార్యక్రమం లో  బి.సి విభాగం జిల్లా కార్యదర్శి బత్తల సుబ్బరాయుడు యాదవ్ తో పాటు పలువురు వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు.

  • షేక్ మహమ్మద్ రఫీ ప్రొద్దుటూరు వైఎస్సార్ కడప జిల్లా