BREAKING
ఐడి కార్డులు పంపిణీ చేసిన వైసిపి మండల అధ్యక్షులు కొత్త గూడ ఘనంగా విజయదశమి వేడుకలు స్వగ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి దసరా వేడుకలు , కొండారెడ్డిపల్లిలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు.. జెమ్మి చెట్టుకు శాస్త్రోక్తంగా పూజలు కల్వకుర్తి దసరా వేడుకల్లో సీఎం రేవంత్‌ రెడ్డి.. రావణ దహనం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఘనంగా దేవీ నవరాత్రులు ఈటల రాజేందర్ నివాసంలో ఘనంగా విజయదశమి వేడుకలు వైయస్సార్సీపి జడ్పీటీసీ అభ్యర్థిగా బోల్లెద్దు ప్రతాప్ కుమార్ -ప్రకటించిన వరికూటి భూమా నంద ఆశ్రమంలో వైభవంగా దుర్గమ్మ వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం. వికసిత్‌ భారత్ లక్ష్య సాధనలో శ్రీరాముడి స్ఫూర్తిని పొందాలి గ్రామపంచాయతీ సిబ్బందికి దుస్తుల పంపిణీ ఇల్లందులో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన- సబ్ రిజిస్టర్ కార్యాలయానికి శంకుస్థాపన, స్టేడియం, ఈనెల 26న చలో హైదరాబాద్ కు వేలాదిగా తరలి రండి షాద్‌నగర్ 18వ వార్డులో ఘనంగా జమ్మి పూజ, రావణ దహనం.... స్థానిక ఎన్నికల వేళ వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు వైభవంగా బిజినేపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామం లో శమి పూజలు...దసరా వేడుకలు...

కృష్ణానదిలో వైభవంగా దుర్గమ్మ తెప్పోత్సవం: హంస వాహనంపై భక్తులకు అభయమిచ్చిన దుర్గామల్లేశ్వరులు

Select Suryaa Now
కృష్ణానదిలో వైభవంగా దుర్గమ్మ తెప్పోత్సవం: హంస వాహనంపై భక్తులకు అభయమిచ్చిన దుర్గామల్లేశ్వరులు

 

విజయవాడ, సూర్య ప్రతినిధి :

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ కృష్ణానదిలో దుర్గమ్మ తెప్పోత్సవం అత్యంత వైభవంగా, కనులవిందుగా సాగింది. ఈ వేడుకలో భాగంగా దుర్గామల్లేశ్వరస్వామివార్లు హంస వాహనంపై ఆశీనులై కృష్ణానది జలాల్లో విహరిస్తూ భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. రంగురంగుల విద్యుద్దీపాల వెలుగులతో సర్వాంగసుందరంగా అలంకరించిన హంసవాహనం కృష్ణమ్మ ఒడ్డున శోభాయమానంగా నిలిచింది. తెప్పోత్సవం నేత్రపర్వంగా పూర్తయిన అనంతరం, ఉత్సవమూర్తులను ఆలయ వీధుల్లో వైభవంగా ఊరేగించారు. ఈ మనోహర ఘట్టాన్ని తిలకించేందుకు నలుమూలల నుంచి వేలాదిమంది భక్తులు తరలివచ్చారు.