దుర్గామాత సేవలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సంజీవరెడ్డి
కొడంగల్, మేజర్ న్యూస్: మండలంలోని పెద్దనందిగామ గ్రామంలో దుర్గామాత ఉత్సవాల ముగింపు సందర్భంగా మంగళవారం నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో కొడంగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంజీవరెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. గ్రామ సర్పంచ్ చెన్ బస్ కుమార్, సత్తి రెడ్డి, గ్రామస్తులు పాల్గొని భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు.
రిపోర్టర్: ఆబిద్, కొడంగల్, వికారాబాద్ జిల్లా.