సీఎం ఇంట్లో ఆయుధ పూజ
హైదరాబాద్, సూర్య ప్రతినిధి :పవిత్ర విజయదశమి పండుగ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆయుధ పూజా కార్యక్రమంలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ వేడుకలో ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ సహా పలువురు ప్రముఖ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు ముఖ్యమంత్రి గారికి ఘనంగా దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.