BREAKING
ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న నగరంగా ఘజియాబాద్: వరల్డ్ పాపులేషన్ రివ్యూ నివేదికలో భారత్ హవా! ఘనంగా ఆయుధ పూజ ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాలో భారత నూతన హైకమిషన్ భవన నిర్మాణానికి ఘనంగా భూమి పూజ! MVSR కళాశాల ప్రమాదం: ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థకు చెందిన ముగ్గురు అరెస్ట్ పిడుగుపాటుకు గురైనా ప్రియుడికి రెండుసార్లు సీపీఆర్ చేసి బతికించిన యువతి: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే పెళ్లి ప్రతిపాదన! షార్ట్ సర్క్యూట్ తో వస్తువులన్నీ బూడిద కృష్ణా ఫేజ్‌-2 పైప్‌లైన్ మరమ్మతులు పూర్తి: 5 గంటల్లోనే నీటి సరఫరా పునరుద్దరణ పీర్ల చావిడిలో వైసీపీ మేయర్ అభ్యర్థి సి.రమేష్ గౌడ్ ప్రత్యేక ప్రార్థనలు పండుగ వేడుకల్లో తీవ్ర విషాదం: సాఫ్ట్‌వేర్ యువతి ఆకస్మిక మృతి కడప కూటమి మేయర్ అభ్యర్థికి బీఫామ్ అందజేసిన ఎమ్మెల్యే నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత! రాప్తాడు, ఆత్మకూరు ఎంపీడీఓ కార్యాలయాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ పి. జగదీష్ భారత్‌ - అమెరికా ట్రేడ్‌ డీల్‌పై త్వరలోనే శుభవార్త ఆసియా పారా గేమ్స్‌లో దీప్తికి స్వర్ణం: సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు దసరా ప్రీమియర్ లీగ్ విజేత రుద్ర టీం ఆసియా పారా గేమ్స్‌లో సిమ్రాన్‌కు స్వర్ణం, తేజల్‌కు కాంస్యం

చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది

Select Suryaa Now
చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది

అమరావతి, సూర్య ప్రతినిధి :రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఎన్నికల్లో పోటీ లేకుండా చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆరోపించారు.

పోలీసులు, ప్రభుత్వ అధికారులను చంద్రబాబు పూర్తిగా తన చెప్పుచేతల్లో ఉంచుకుని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకులు, అభ్యర్థులు కనీసం నామినేషన్లు కూడా వేయకుండా అడ్డుకోవడానికి చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని సజ్జల ఆరోపించారు.