పీర్ల చావిడిలో వైసీపీ మేయర్ అభ్యర్థి సి.రమేష్ గౌడ్ ప్రత్యేక ప్రార్థనలు
అనంతపురం బ్యూరో (అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్) : అనంతపురం నగరంలోని 58వ డివిజన్ రంగస్వామి నగర్లో వెలసిన గూగుడు కుల్లాయి స్వామి పీర్ల చావిడిలో మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి సి.రమేష్ గౌడ్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్పొరేటర్ అభ్యర్థులు పాల్గొని స్వామి ఆశీస్సులు పొందారు.
రంగస్వామి నగర్‌లోని గూగుడు కుల్లాయి స్వామి మకానం ప్రాంతీయ భక్తులకు విశ్వాస కేంద్రంగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో మేయర్ అభ్యర్థి సి.రమేష్ గౌడ్‌తో పాటు 58వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి భవాని, 59వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి అనిల్ కుమార్ గౌడ్ స్వామికి పూజలు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా సి.రమేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, నగర అభివృద్ధి, వార్డుల ప్రగతి, ప్రాంతీయ ఐక్యత కోసం స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో కార్పొరేటర్ అభ్యర్థులు సమష్టిగా కృషి చేసి విజయాన్ని సాధించాలని పిలుపునిచ్చారు. ప్రతి గడపకు వెళ్లి ప్రజలను కలుసుకుంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విధానాలను వివరించాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసేలా ఓటర్లకు అవగాహన కల్పించాలని సూచించారు.
కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకుడు మీసాల రంగన్న, ఎస్సీ సెల్ నాయకుడు పెన్నోబులేసు, స్థానిక నాయకులు గిరి, పక్కీరప్ప, పాన్ సాదిక్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం నాయకులు పరస్పరం అభినందించుకుంటూ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.