దసరా ప్రీమియర్ లీగ్ విజేత రుద్ర టీం
దుద్యాల్, మేజర్ న్యూస్:
మండల కేంద్రంలో నిర్వహించిన దసరా ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. విజేతగా రుద్ర టీం నిలిచింది. రెండవ స్థానంలో రన్నర్ పవర్ హాటర్ జట్టు నిలిచింది. మొదటి విజేతకు రూ. 7000 రెండో విజేతకు రూ. 5000 రూపాయలు బహుమతి అందించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మెరుగు శ్రీకాంత్, విలేజ్ ప్రెసిడెంట్ అనిల్, PACS డైరెక్టర్ ఖలీల్ పాషా, కుర్షీద్, టోర్నమెంట్ నిర్వాహకులు నరేందర్ గౌడ్, సంతోష్ మరియు రాజమూరి రాజశేఖర్ పాల్గొన్నారు.
రిపోర్టర్: రమేష్, దుద్యాల్, వికారాబాద్ జిల్లా.