BREAKING
ప్రధాని నివాసం సమీపంలోని చారిత్రక రేస్ కోర్స్ మసీదుకు ఎవిక్షన్ నోటీసు: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు జోక్యాన్ని కోరిన అసదుద్దీన్ ఒవైసీ! చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా.. డాక్టర్ గడల శ్రీనివాసరావు కస్టడీ పొడిగింపుపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా: ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఉత్తర్వుల సవాలు! గుజరాత్‌లో నాలుగు ఘోర రోడ్డు ప్రమాదాలు: విధుల్లో ఉన్న పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ సహా 11 మంది దుర్మరణం! గ్రేటర్ నోయిడాలో 19వ రెన్యూవబుల్ ఎనర్జీ ఇండియా ఎక్స్‌పో: 1,080 మంది ఎగ్జిబిటర్లతో స్వచ్ఛ ఇంధన సాంకేతికతల ప్రదర్శన! ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణతో కాంగ్రెస్ బెంబేలు: బీజేపీ నేత శ్రీకాంత్ శర్మ తీవ్ర వ్యాఖ్యలు! పలమనేరు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ 33 వార్డుల్లో పోటీ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో మరో కీలక ఘట్టం: 5వ యూనిట్ ట్రయల్ రన్ విజయవంతం వెల్దుర్తి మండల అభివృద్ధికి సుబ్బారాయుడు కుటుంబం కృషి అభినందనీయం ముంబైలోని చారిత్రక గేట్‌వే ఆఫ్ ఇండియాను సందర్శించిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో: 26/11 అమరులకు నివాళి! శ్రీకాకుళం బీచ్‌లో తీవ్ర విషాదం: స్నానానికి వెళ్ళి నలుగురు గల్లంతు కృష్ణానదిలో వైభవంగా దుర్గమ్మ తెప్పోత్సవం: హంస వాహనంపై భక్తులకు అభయమిచ్చిన దుర్గామల్లేశ్వరులు 34వ డివిజన్‌లో సరిపూటి రమణ ప్రచార హోరు.. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థన.. బైరాగి గూడా లో ఘనంగా దసరా వేడుకలు దుర్గామాత సేవలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సంజీవరెడ్డి

MVSR కళాశాల ప్రమాదం: ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థకు చెందిన ముగ్గురు అరెస్ట్

Select Suryaa Now
MVSR కళాశాల ప్రమాదం: ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థకు చెందిన ముగ్గురు అరెస్ట్

హైదరాబాద్, సూర్య ప్రతినిధి :రంగారెడ్డి జిల్లా నాదర్‌గుల్‌లోని ఎంవీఎస్ఆర్ (MVSR) ఇంజినీరింగ్ కళాశాలలో సంభవించిన ప్రమాద ఘటనలో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ ఘటనకు బాధ్యులుగా చేస్తూ ఈవెంట్ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ‘సాకేత్’ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీకి చెందిన ముగ్గురు వ్యక్తులను ఆదిబట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. అదేవిధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను ఎంవీఎస్ఆర్ కళాశాల యాజమాన్యంపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.

కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన వేడుకల్లో భారీగా ఏర్పాటు చేసిన లైటింగ్ ట్రస్ (లైటింగ్ పోల్) తగినంత బలం, సరైన సపోర్టు లేకుండా అమర్చడం వల్లే అది అకస్మాత్తుగా కుప్పకూలి ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు. భద్రతా ప్రమాణాలు పాటించకుండా, బాధ్యతారాహిత్యంగా లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసినందున ఈవెంట్ మేనేజర్, సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

విద్యార్థుల భద్రతను విస్మరించిన కళాశాల యాజమాన్యం పాత్రపై కూడా సమగ్ర విచారణ జరుపుతున్నామని, నిర్లక్ష్యానికి పాల్పడిన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు తెలిపారు.