భారత్ - అమెరికా ట్రేడ్ డీల్‌పై త్వరలోనే శుభవార్త
వాషింగ్టన్/న్యూఢిల్లీ:భారత్ - అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి (ట్రేడ్ డీల్) సంబంధించి త్వరలోనే ఓ మంచి శుభవార్త వింటారని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించి చర్చలు తుది దశకు చేరాయని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య ట్రేడ్ డీల్‌కు సంబంధించి కొన్ని అంశాలు ఇంకా తేలాల్సి ఉందని, మరికొన్ని చర్చలు పెండింగ్‌లో ఉన్నాయని మార్కో రూబియో తెలిపారు. అయితే, ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పెండింగ్ అంశాలపై త్వరలోనే స్పష్టత వస్తుందని, వాణిజ్య ఒప్పందం కొలిక్కి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.