ఆసియా పారా గేమ్స్‌లో సిమ్రాన్‌కు స్వర్ణం, తేజల్‌కు కాంస్యం
న్యూఢిల్లీ:ఆసియా పారా గేమ్స్‌లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో రాణిస్తూ దేశానికి మరో రెండు పతకాలను అందించారు. మహిళల 200 మీటర్ల టీ-12 (T-12) విభాగంలో భారత స్ఫ్రింటర్లు డబుల్ పోడియం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించారు.
ఈ విభాగంలో భారత స్ప్రింటర్ సిమ్రాన్ శర్మ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. కాగా, ఇదే పోటీలో మరో భారత అథ్లెట్ తేజల్ బెన్ దామోర్ కాంస్య పతకాన్ని గెలుచుకుని మెరిసారు. ఒకే ఈవెంట్లో భారత్‌కు బంగారం, కాంస్య పతకాలు రావడంపై క్రీడాభిమానులు, అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.