బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పురుషుల జాతీయ సెలక్షన్ కమిటీలో కీలక మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. భారత మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజాను బీసీసీఐ పురుషుల సెలక్షన్ కమిటీ నూతన ఛైర్మన్ (చీఫ్ సెలక్టర్)గా నియమించింది. సీనియారిటీ, నిబంధనలను ప్రామాణికంగా తీసుకుని ఆయనకు ఈ బాధ్యతలను అప్పగించారు. మరోవైపు, టీమిండియా మాజీ స్పిన్నర్, మాజీ కోచ్ రమేష్ పవార్‌ను కూడా ఈ సీనియర్ పురుషుల సెలెక్షన్ కమిటీలోకి సభ్యుడిగా చేర్చుకున్నారు. క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) సిఫారసుల మేరకు బీసీసీఐ ఈ నియామకాలను పూర్తి చేసింది.