శ్రీరామ్ చినబాబు విజయమే లక్ష్యంగా ముందుకు సాగుదాం : తొగట వీరక్షత్రియుల ఏకగ్రీవ తీర్మానం
మదనపల్లె,మేజర్ న్యూస్ : మున్సిపల్ చైర్మన్‌గా కూటమి అభ్యర్థి శ్రీరామ్ చినబాబును గెలిపించేందుకు తొగట వీర క్షత్రియులంతా ఐక్యంగా ముందుకు సాగుతామని కులబాంధవులు ప్రకటించారు.ఈ మేరకు మంగళవారం మదనపల్లె పట్టణం,చౌడేశ్వరి కళ్యాణ మండపంలో తొగట వీర క్షత్రియ కుల బంధువులు విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీరామ్ చినబాబు విజయమే లక్ష్యంగా తమవంతు కృషి చేస్తామని తెలిపారు.కుల బంధువులందరూ ఐక్యంగా నిలిచి,ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొని ఆయనకు మద్దతుగా ప్రజల్లోకి వెళ్తామని పేర్కొన్నారు.మదనపల్లె మున్సిపల్ చైర్మన్‌గా శ్రీరామ్ చినబాబు ఎన్నికయ్యేలా సమష్టిగా కృషి చేస్తామని స్పష్టం చేశారు.తొగటవీర క్షత్రియులందరూ సమన్వయంతో ముందుకు సాగుతూ శ్రీరామ్ చినబాబు విజయానికి కృషి చేస్తారని ఈ సందర్భంగా వారు వెల్లడించారు.పార్టీలకతీతంగా తొగటవీర క్షత్రియులు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.తెలుగుదేశం పార్టీలో మాస్ లీడర్,డైనమిక్ లీడర్ గా శ్రీరామ్ చినబాబు గుర్తింపు తెచ్చుకున్నారని,మదనపల్లి మునిసిపల్ ఛైర్ పర్సన్ పీఠంపై ఆయనను కూర్చోబెట్టేంత వరకు విశ్రమించభోమన్నారు.ఈ కార్యక్రమంలో తొగటవీర క్షత్రియు సంఘం జిల్లా అధ్యక్షులు భోజనపు వెంకట నారాయణ,గుండ్లపల్లి యోగేశ్వర్ బాబు (పెదబాబు),మోడెమ్ వెంకటరమణ గొరవ అధ్యక్షులు,మోడెం సిద్దప్ప గౌరవ ఉపాధ్యక్షులు రామిశెట్టి నీలకంఠ,గౌరవ ఉపాధ్యక్షులు ఆర్.కె మోహన,గౌరవ ఉపాధ్యక్షులు ఉప్పు రామచంద్ర,గౌరవ ఉపాధ్యక్షులు బండి నాగరాజు,గౌరవ ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ,గౌరవ ఉపాధ్యక్షులు కే.వి.నాగరాజు,టిడిపి సీనియర్ నాయకులు రామిశెట్టి కృష్ణ (కమలామర్రి),బిజెపి నాయకులు భువనేశ్వరి సత్య,బొమ్మిశెట్టి కృష్ణమూర్తి,పురాణం చంద్రశేఖర్ అధ్యక్షులు చౌడేశ్వరి దేవి దేవస్థానం,రామిశెట్టి రత్నమయ్య కోశాధికారి చౌడేశ్వరి దేవి దేవస్థానం,బండి పవన్ కుమార్ చౌడేశ్వరి దేవి దేవస్థానం సెక్రటరీ,సిబ్యాల వేణుగోపాల్,గుండ్లపల్లి ప్రభాకర్,బీజేపి యువనాయకులు శ్రీకాంత్,చేనేత నాయకులు మోడెం నాగరాజు,లోకేష్,ముంబై దుర్గా తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి