జనసేన పార్టీని బలపితం చేయడమే మా లక్ష్యం
తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేయడమే మా లక్ష్యం .
కోయిల్ కొండ, సూర్య న్యూస్:
. జనసేన పార్టీ నాయకులు రాజు రారాజు కటిక రాజు కోయిలకొండ సూర్య : జనసేన పార్టీ అధినే త పవన్ కళ్యాణ్ నేతృత్వంలో తెలంగాణలో ఉన్న గ్రామ గ్రామాలలో ఉన్న యువకులు, అభిమాను లు, జనసేన పార్టీ నాయకులతో కలిసిజనసేన పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని జనసేన పార్టీ నాయకులు రాజు రారాజు కటిక రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ,మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంను జనసేన రాష్ట్ర నాయకులు గుడిబండ రవి ఆధ్వర్యంలో ప్రారంభించారని కటిక రాజు తెలిపారు.
జనసేన పార్టీ మహబూబ్‌నగర్ పార్లమెంట్ కోఆర్డినేటర్ మేడ రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై కార్యాలయాన్ని ప్రారంభించారని తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నాయకులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా పార్టీ కార్యాలయం పనిచేయాలని పేర్కొన్నారు. అదేవిధంగాగుడిబండ రవి మాట్లాడుతూ.. దేవరకద్ర నియోజకవర్గంలో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతో పాటు, ప్రజలకు పార్టీని మరింత చేరువ చేయడమే లక్ష్యమని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం నాయకులు, కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలని అన్నారు. ప్రజల సమస్యలపై స్పందిస్తూ, ప్రజలకు అండగా నిలవడమే పార్టీ నాయకులు, కార్యకర్తల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, యువత, ప్రజలను పార్టీ కార్యకలాపాల్లో భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ
అధికార ప్రతినిధి బైరపోగు సాంబశివుడు, గద్వాల జిల్లా నాయకులు గట్టు తిమ్మప్ప, మక్తల్ నియోజకవర్గ నాయకులు మణికంఠ గౌడ్, మహబూబ్ నగర్ జిల్లా నాయకులు రాఘవేంద్ర, వీరమహిళలు శ్రీవల్లి, కనకదుర్గ, నవనీత, అనిత చారి, మునైః, బలరాజ్, రవి మక్తల్ నియోజకవర్గ నాయకులు బదేపల్లి నరేష్ గౌడ్, కృష్ణ, గౌడి బాలరెడ్డి, రామన్న గౌడ్, నారాయణపేట జిల్లా ముఖ్య నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, గుడిసె నరసింహ, అరుణ్ గౌడ్, రామకృష్ణ, దేవరకద్ర నియోజకవర్గ నాయకులు గోపే లక్ష్మీనారాయణ, శరత్ గౌడ్, రమేష్, నరసింహ, సురేష్, రాములు సాగర్, శ్యామ్, నరసింహ, రాములు, బాలకృష్ణ, శివ పాల్గొన్నారు.