విజయదశమి సందర్భంగా ఆందోల్ మైసమ్మ ఆలయంలో డా. చినుకని శివ ప్రసాద్ ప్రత్యేక పూజలు
చౌటుప్పల్, మేజర్ న్యూస్ :విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డా. చినుకని శివ ప్రసాద్ ఆందోల్ మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ప్రార్థించారు.
ఈ సం,దర్భంగా డా. శివ ప్రసాద్ మాట్లాడుతూ, విజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని, ప్రతి ఒక్కరూ ధర్మం, న్యాయం, సేవాభావంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ప్రజల జీవితాల్లో సుఖశాంతులు, సిరిసంపదలు వెల్లివిరియాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కంచర్ల అశ్విన్ రెడ్డి, దేవాలయ ధర్మకర్తలు, చినుకని యువరాజు, బడుగు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.