ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలి
ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలి
-సుడా మాజీ చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి
సిద్దిపేట రూరల్ :విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని సిద్దిపేట ప్రాంత ప్రజలందరికీ సుడా మాజీ చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగను జరుపుకుంటామని అన్నారు. ఈ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలు, ఆనందాలు నింపాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని, ప్రతి కుటుంబంలో సిరిసంపదలు వెల్లివిరియాలని కోరుకున్నారు.దసరా పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, పండుగలు ప్రజల మధ్య ప్రేమాభిమానాలు,ఐకమత్యాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. విజయదశమి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ మంచి ఆలోచనలతో ముందుకు సాగాలని, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరి ప్రతి ఇంటా ఆనందం నిండాలని, రైతులు, యువత, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని కోరారు. ప్రజలందరూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి విజయదశమి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
(సూర్య రూరల్, రమేష్)