విజయదశమి సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ
అశ్వారావుపేట,సూర్య ; అశ్వారావుపేట నియోజకవర్గంలోని బండారు గుంపు గ్రామంలో సీనియర్ నాయకులు బిర్రం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో విజయదశమి సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ప్రజల మధ్య ఐకమత్యం, సోదరభావం కొనసాగాలని ఆకాంక్షించారు.చీరల పంపిణీపై గ్రామ మహిళలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మహేశ్వర్ రెడ్డి, బయట ధర్మారావు, నరం నాగేశ్వరరావు, కూరం శ్రీను, జుజురి సత్యనారాయణ, ఉప్పల ప్రసాద్, ఉప్పల మురళి, లోకం సాంబశివరావు, రొయ్యల సత్యనారాయణ, బిర్రం ఉదయ్ కుమార్ తదితర నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.