ఎన్నికల నేపథ్యంలో రేణిగుంటలో వాహనాల తనిఖీలు
రేణిగుంట మేజర్ న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి అమలులో భాగంగా రేణిగుంటలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. హౌసింగ్ ఏఈ రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో అక్రమ నగదు, మద్యం, ఇతర అనుమతిలేని వస్తువుల తరలింపుపై అధికారులు నిఘా పెట్టారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా తనిఖీలు చేపడుతున్నారు.
రిపోర్టర్: రమేష్ బాబు కొండల