కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణం
అనంతపురం మేజర్ న్యూస్ ప్రతినిధి:-అనంతపురంలోని హెచ్ ఎల్ సి కెనాల్ వద్ద కొలువైన శ్రీ కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయంలో మంగళవారం సాయంత్రం ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు హనుమాన్ చాలీసా పారాయణం, 6.30 గంటలకు అమ్మవారికి కుంకుమార్చన, రాత్రి 7 గంటలకు మహా మంగళహారతి నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి, అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ సభ్యులు విజయ్ కుమార్ కోరారు.
(మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్)