BREAKING
దసరా పండుగ సందర్భంగా మల్టీ పర్పస్ వర్కర్లకు నూతన వస్త్రాల పంపిణీ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ ఆలూరు సాంబ శివారెడ్డిని కలిసిన వైసీపీ మేయర్ అభ్యర్థి సి. రమేష్ గౌడ్ మేయర్ ఎన్నికల్లో సహకారం కోరిన రమేష్ గౌడ్.. నగర అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి దసరా సందర్భంగా తిమ్మారెడ్డిపల్లిలో జెండా ఆవిష్కరణ నేరుగా ఓటీటీలోకి సస్పెన్స్ థ్రిల్లర్ 'రుద్రవనం పిఎస్'.. స్ట్రీమింగ్ డేట్ మరియు ట్రైలర్ మైండ్ బ్లాకింగ్! స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగాఎర్రగుంట్ల పోలీసుల హెచ్చరిక. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలి బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో దసరా పూజలు కొడుకు టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల మరుసటి రోజే సీఎం ఫడ్నవీస్‌తో కలిసి వేదిక పంచుకున్న జాకీ ష్రాఫ్! దిల్లీ లవ్ కుష్ రామ్‌లీలాలో యామీ గౌతమ్ సందడి.. దసరా వేడుకల్లో రావణ వధ చేయనున్న నటి! రాజరాజేశ్వరి అలంకారంలో కనకదుర్గమ్మ దర్శనం రామాయణం' వీఎఫ్ఎక్స్‌పై చిన్న చిన్న తప్పులు వెతకొద్దు.. విజ్ఞప్తి చేసిన రాకింగ్ స్టార్ యశ్! టైగర్ ష్రాఫ్ కారుపై దాడి కేసులో బెదిరింపుల కోణం.. ప్రముఖ నటుడు రాకేష్ బేడీ సంచలన వ్యాఖ్యలు! దశమి పండుగంటే ఆ ఆనందమే వేరు.. దసరా సెలబ్రేషన్స్‌పై మనసు విప్పిన నటి నిమ్రత్ కౌర్! రామాయణం ఈవెంట్‌లో సరదా పొరపాటు.. రణ్‌బీర్ కపూర్‌ను రణ్‌వీర్ సింగ్ అంటూ అభివర్ణించిన దిల్రాజు!

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగాఎర్రగుంట్ల పోలీసుల హెచ్చరిక.

Select Suryaa Now
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగాఎర్రగుంట్ల పోలీసుల హెచ్చరిక.

ఎర్రగుంట్ల మేజర్ న్యూస్: ఈనెల 21వ తేదీ నుంచి   స్థానిక సంస్థల (ఎంపీటీసీ మరియు జెడ్పిటిసి) ఎన్నికల నామినేషన్ల కార్యక్రమం ప్రారంభం అవుతుందని, ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మరియు జమ్మలమడుగు డిఎస్పి ఆదేశాల ప్రకారం ఎన్నికలలో పాల్గొనే అభ్యర్థులకు ప్రజలకు ఎర్రగుంట్ల సీఐ విశ్వనాథరెడ్డి, ఎర్రగుంట్ల ఎస్సై నాగమురళి   కొన్ని సూచనలు చేశారు. ఈ నామినేషన్ల కార్యక్రమాల్లో పాల్గొనే అభ్యర్థులకు కేవలం పోటీ చేసే అభ్యర్థి ప్లస్ బలపరిచే అభ్యర్థి మరియు విటినెస్ గా ఒకరు కలిసి మొత్తం వన్ ప్లస్ టు మాత్రమే ఎర్రగుంట మండల ప్రజా పరిషత్ ఆఫీసులోకి రావాల్సి ఉంటుందని సూచించారు. వారు కూడా 500 మీటర్ల దూరంలోనే తమ వాహనాలుఉంచి రావాల్సి ఉంటుందని సూచించారు. ఈ మండలంలో ఓటు లేని మరియు భేటీ ప్రాంతాల నుంచి ఎవరు కూడా రాకూడదని హెచ్చరించారు. అలా ఎవరైనా వస్తే మండల తాసిల్దార్ ఆదేశాల ప్రకారం  సెక్షన్ 144 ప్రకారం  కేసులు నమోదు చేస్తామని తెలియజేశారు. ఈ నామినేషన్ల సందర్భంగా ఎలాంటి దౌర్జన్యాలు గలాటాలు సృష్టించిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎలాంటి దౌర్జన్యాలు ఘర్షణలు సృష్టించకుండా  ప్రశాంత వాతావరణంలో నామినేషన్ల కార్యక్రమం ముగించుకోవాలని సూచించారు. ఎటువంటి దౌర్జన్యాలు ఘర్షణలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

  • సి లక్ష్మీ నారాయణ ఎర్రగుంట్ల వైఎస్సార్ కడప జిల్లా