BREAKING
అమ్మవారి ని దర్శించుకున్న కలెక్టర్ దంపతులు ఏపీఎస్ఈఏ అనంతపురం జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన నల్లపల్లి విజయభాస్కర్ సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలో పాల్గొన్నారు : మహేంద్ర యాలాల పోలీస్ స్టేషన్‌లో ఘనంగా ఆయుధ పూజలు మలక్‌పేటలో జింక మాంసం కలకలం.. ముగ్గురు అరెస్ట్ రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి కొద్దిసేపట్లో స్వగ్రామానికి సీఎం రేవంత్‌రెడ్డి రాక సీఎం రేవంత్ రెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపిన పీసీసీ అధ్యక్షుడు చీరాల టీడీపీ క్యాంపు కార్యాలయంలో దసరా వేడుకలు సీఈసీ దిష్టిబొమ్మ దహనం: ఢిల్లీలో యూత్ కాంగ్రెస్ వినూత్న నిరసన చెడుపై మంచి విజయం.. భక్తిశ్రద్ధలతో వత్సవాయి పోలీస్‌స్టేషన్‌లో దసరా వేడుకలు! పాఠశాల నిర్మాణానికి భూమి పూజ దసరా పండుగ సందర్భంగా మల్టీ పర్పస్ వర్కర్లకు నూతన వస్త్రాల పంపిణీ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ ఆలూరు సాంబ శివారెడ్డిని కలిసిన వైసీపీ మేయర్ అభ్యర్థి సి. రమేష్ గౌడ్ మేయర్ ఎన్నికల్లో సహకారం కోరిన రమేష్ గౌడ్.. నగర అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి

ఆలూరు సాంబ శివారెడ్డిని కలిసిన వైసీపీ మేయర్ అభ్యర్థి సి. రమేష్ గౌడ్ మేయర్ ఎన్నికల్లో సహకారం కోరిన రమేష్ గౌడ్.. నగర అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి

Select Suryaa Now
ఆలూరు సాంబ శివారెడ్డిని కలిసిన వైసీపీ మేయర్ అభ్యర్థి సి. రమేష్ గౌడ్  మేయర్ ఎన్నికల్లో సహకారం కోరిన రమేష్ గౌడ్.. నగర అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి

అనంతపురం బ్యూరో (అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం నగర పాలక సంస్థ మేయర్ అభ్యర్థి సి. రమేష్ గౌడ్ మంగళవారం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్నారై విభాగం గ్లోబల్ కోఆర్డినేటర్ ఆలూరు సాంబ శివారెడ్డిని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మేయర్ ఎన్నికల్లో తన విజయానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని కోరారు.

అనంతపురం నగర అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని రమేష్ గౌడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. మేయర్ ఎన్నికల్లో పార్టీ శ్రేణుల మద్దతు, సహకారం ఎంతో కీలకమని అభిప్రాయపడ్డారు. నగరంలోని ప్రజలను చేరుకోవడం, పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయంతో ముందుకు సాగడం వంటి అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

రమేష్ గౌడ్ విజయానికి అవసరమైన సహకారం అందించే అంశంపై ఆలూరు సాంబ శివారెడ్డి సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించాయి. ఈ భేటీతో మేయర్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నెలకొంటుందని పార్టీ నాయకులు భావిస్తున్నారు. కార్యక్రమంలో పలువురు స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.