హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు
తిరుపతి జిల్లా 2017 జూన్ 04వ తేదీన డక్కిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సంగనపల్లి గ్రామం ఎస్టీ కాలనీలో పాత కక్షలు, కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన హత్య కేసులో నిందితుడికి గౌరవ 7వ అదనపు జిల్లా న్యాయస్థానం, గూడూరు జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.15,000 జరిమానా విధించింది.ఈ కేసులో నిందితుడు శనగా శ్రీరాములు తనకు వరుసకు అన్న అయిన శనగా అంకయ్యతో ఉన్న పాత కక్షల నేపథ్యంలో, హత్య చేయాలనే ఉద్దేశంతో కర్రతో అతని తలపై బలంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన అంకయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.