హరీష్ స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు
కదిరి రూరల్ పరిధి లోని ఎరుకలవాండ్లపల్లి సమీపంలో ఉన్న హరీష్ పాఠశా లలో ప్రిన్సిపాల్ ఎం.ఎస్. కిరణ్ ఆధ్వర్యంలో శనివారం బాలల దినోత్సవాన్ని ఘనంగానిర్వహించారు. ఈ సంద ర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ దేశ, రాష్ట్ర ప్రభుత్వాలు బాలల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, వారికి నాణ్యమైన విద్య, ఆరోగ్యంతో పాటు సమాన అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాయని తెలిపారు. అందరూ అనుభవించే బాల్యం భగవం తుడు ఇచ్చిన ఓ అమూల్యమైన వరమని, అభం శుభం తెలియని ఆ పసి మనసులు పూతోటలో అప్పుడే పరిమళించిన పువ్వులని, అందు కు సూచకంగా ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలో బాలల దినోత్స వాలు జరుపుకుం టున్నారని గుర్తు చేశారు. అదేవిధంగా మనదేశంలోనూ నవంబరు 14న బాలల దినోత్సవం జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. తొలుత జవహర్ లాల్ నెహ్రూ చిత్ర పటానికి పూలమా లలు వేసి నివాళుల ర్పించారు.అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలుఅలరించాయి. ముందురోజు విద్యార్థులకు ఆటలపోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యా ర్థులకు ప్రిన్సిపాల్ బహుమతులు, సర్టిఫికెట్లు అందిం చారు.విద్యార్థులందరికీ మిఠాయిలు పంచిపెట్టి బాలల దినోత్సవ శుభా కాంక్షలు తెలియ జేశారు.కార్యక్రమంలో ఉపాధ్యా యులు, సిబ్బంది, విద్యార్థుల తల్లి దండ్రులు, విద్యా ర్థులు పాల్గొన్నారు.