గ్రూప్ 2 పరీక్ష పై అవగాహన సదస్సు
శ్రీకాకుళం నవంబర్ 13 మేజర్ న్యూస్ :శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల రోడ్ లోగల కాకినాడ శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాల (కొ.ఎడ్యుకేషన్ ) లో శనివారం అనగా నవంబర్ 14వ తేదీ ఉదయం 10 గంటలకు గ్రూప్ 2 పరీక్ష పై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ ఎన్వి. వేణుగోపాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రూప్ 2 పరీక్ష విధానం, సిలబస్, వివిధ అంశాలపై కూలంకషంగా వివరణతో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్టు ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ సదస్సులో ఆదిత్య కాంపిటీటివ్ డైరెక్టర్ గణేష్, అనుభవజ్ఞులైన అధ్యాపక బృంధంచే విద్యార్ధుల సందేహ నివృత్తి నిర్వహించబడుతుందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పరిసర ప్రాంత అభ్యర్థులు గ్రూప్ 2 అభ్యర్థులు, డిగ్రీ పాసైన విద్యార్థులు నవంబర్ 14వ తేదీ ఉదయం 10 గంటలకు ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరలో గల తమ కాకినాడ శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాలలో జరిగే అవగాహన సదస్సు కు హాజరు అయి తమ పేరు నమోదు చేసుకోవలసినదిగా తెలిపారు. తమ ఆదిత్య పోటీ పరీక్షల సంస్థ గత 40 సంవత్సరాలుగా ఎంతోమంది అభ్యర్థులను వివిధ పోటీ పరీక్షలకు సన్నుద్ధులను చేసి ఎన్నో ఉద్యోగాలను కల్పించారని, ఇప్పుడు గ్రూప్ -2 పరీక్ష కోచింగ్ తమ కాకినాడ ఆదిత్య పోటీ పరీక్షల సంస్థలో ప్రారంభిస్తున్నామని ఆదిత్య డైరెక్టర్ గణేష్ తెలిపారు. కావున గ్రూప్ -2 అభ్యర్థులు ఈ సదస్సును వినియోగించుకోవాలని తెలిపారు.