BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026 శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి

గ్రామాల వారీగా అభిప్రాయాల సేకరణ.. గెలుపు గుర్రాల ఎంపికపై గాదె మధుసూదన్ రెడ్డి దృష్టి!

Select Suryaa Now
గ్రామాల వారీగా అభిప్రాయాల సేకరణ.. గెలుపు గుర్రాల ఎంపికపై గాదె మధుసూదన్ రెడ్డి దృష్టి!

మార్టూరు, మేజర్ న్యూస్:

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మార్టూరు మండలంలో రాజకీయ సందడి నెలకొంది. ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికపై ప్రధాన దృష్టి సారించిన పర్చూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, రాష్ట్ర కార్యదర్శి గాదె మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో మండల స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. మండల పరిధిలోని అన్ని గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో సమావేశమై అభ్యర్థుల ఎంపికపై సమీక్షించారు.

ఈ సందర్భంగా గాదె మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తూ, ప్రజల్లో మంచి ఆదరణ కలిగిన నాయకులకు అభ్యర్థుల ఎంపికలో ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. గ్రామాల వారీగా స్థానిక నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించి, పార్టీ విజయావకాశాలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని, మండలవ్యాప్తంగా పార్టీ విజయానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అభ్యర్థుల ఎంపికలో క్షేత్రస్థాయి పరిస్థితులు, ప్రజల ఆదరణ, పార్టీ కోసం పనిచేసిన వారి సేవలను పరిగణనలోకి తీసుకోవడంపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం.

ఈ సమావేశంలో మార్టూరు మండలానికి చెందిన వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికపై జరుగుతున్న ఈ కసరత్తు మార్టూరు మండల రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.