BREAKING
పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులను అభినందించిన వరంగల్ సిపి శ్రీ పద్మాక్షి దేవాలయ శరన్నవరాత్రి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ దంపతుల కొత్త సినిమా 'తూ హై మేరీ కిరణ్' ట్రైలర్ విడుదల! జాతీయ అవార్డు గ్రహీత చంద్రకళకు పోలీస్ శాఖ సత్కారం గ్రామీణ ప్రజలకు వైద్యం మరింత చేరువ: ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఎస్పీ బాలుతో ఆ జ్ఞాపకం ఇప్పటికీ మరువలేను.. ఎస్వీ కృష్ణా రెడ్డి ఎమోషనల్ పోస్ట్! చెత్తను సద్వినియోగం చేసుకోవాలి ఆశావర్కర్స్కు కనీసవేతనాలు చెల్లించాలి. అయోడిన్ లోప రుగ్మతల నియంత్రణకు జిల్లా స్థాయి సర్వే.. ఎముకల ఆరోగ్యం: వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు దృఢంగా ఉండాలంటే రోజూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ప్రొటీన్ లోపం రాకుండా ఉండాలంటే రోజువారీ మన శరీరానికి ఎంత ప్రొటీన్ అవసరమో తెలుసా? ఐరన్ లోపం: శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గి అలసట, తల తిరగడానికి అసలు కారణం ఏమిటో తెలుసా? కరీనా షోలో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌‌పుత్.. ఆ యాడ్ వివాదంపై కృతి సనన్ షాకింగ్ కామెంట్స్! లక్ష్మీపోలవరంలో అంగన్వాడీ ఉత్సవ్ ప్రజలకు శుభ్రమైన తాగునీరు అందేలా చర్యలు

గొట్టివలసలో విజయవంతంగా "పోషణ్ మా" కార్యక్రమం

Select Suryaa Now
గొట్టివలసలో విజయవంతంగా "పోషణ్ మా" కార్యక్రమం
  • ఐసిడిఎస్ పి ఓ గొట్టాపు సుగుణకుమారి,రౌతు లక్ష్మీ
  • అంగన్వాడీ వర్కర్ లు పద్మావతి,మీనాక్షిలకు సన్మానం

గరుగుబిల్లి: గర్భిణులు, బాలింతలు మరి యు చిన్నారుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'పోషణ్ మా" (జాతీయ పోషణ మాసం) కార్యక్ర మంతో పాటు సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని గొట్టివలస గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన అంగన్వాడీ వర్కర్ లు చింతాల పద్మావతి, పెద్దింటి మీనాక్షిల తోపాటు ఆయాలకు చిన్నారుల తల్లిదండ్రులతో పాటు పలువురు లబ్ధిదారులు సోమవారం ఘనంగా సత్కరించారు.ఈసందర్భంగా అంగన్వాడీ వర్కర్ లు చింతాల పద్మావతి,పెద్దింటి మీనాక్షి,ఆయాలకు శాలువలు కప్పి ఘనంగా సన్మానించారు.అదే విధముగా సేవా సంకల్ప అభియాన్ కార్యక్ర మంలో భాగంగా కొమరాడ ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి గొట్టాపు సుగుణ కుమారి,గరుగుబిల్లి సెక్టార్ ఐ సి డి ఎస్ సూపర్వైజర్ రౌతు లక్ష్మీ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహార ప్రదర్శన ఏర్పాటు చేశారు.అనంతరం జరిగిన సమావేశంలో కొమరాడ ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి గొట్టాపు సుగుణకుమారి మాట్లాడుతూ పోషకాహారలోపాన్ని నిర్మూలించడంలో అంగన్‌వాడీ కార్యకర్తలు మరియు ఆయాల పాత్ర ఎంతో కీలకమైనదని కొనియాడారు.నెల రోజుల ప్రజలకు పోషకాహారంపై అవగాహన కల్పించేం దుకు వారు చేసిన కృషి అభినందనీ యమన్నారు.ఉత్తమ సేవలకు గుర్తింపు పోషణ్ మా ఉత్సవాల్లో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరి చిన అంగన్‌ వాడీ కార్యకర్తలను అధికారు లు మరియు ప్రజాప్రతినిధులు శాలువలు కప్పి ఘనంగా సన్మానించ డం జరుగుతుందన్నారు.పోషణ్ మాసోత్సవాలలో అంగన్‌వాడీ కార్య కర్తలకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా చేపట్టిన 9వ రాష్ట్రీయ పోషణ్ మాస్ (జాతీయ పోష కాహార మాసం - 2026) ఉత్సవాల్లో భాగంగా, క్షేత్ర స్థాయిలో విశేష సేవలు అందిస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలను భారతీయ జనతా పార్టీ తరఫున సన్మా నించడం జరుగుతుందన్నారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశాన్ని 'సుపోషిత్ భారత్' (పోషకా హార లోపం లేని భారతదేశం)గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ పోషణ్ అభియాన్ కొన సాగుతోందని పేర్కొ న్నారు.గరుగుబిల్లి సెక్టార్ సూపర్వైజర్ రౌతు లక్ష్మి మాట్లాడుతూ చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యం కోసం శ్రమిస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలే నిజమైన క్షేత్రస్థాయి యోధులని పేర్కొన్నారు.సమాజంలో వారి సేవలు వెలకట్టలేనివని, అందుకే కేంద్ర ప్రభుత్వం 'సేవా సంకల్ప్ అభియాన్' ద్వారా తగిన గుర్తింపు ఇస్తోందని తెలి పారు.ఈకార్యక్రమంలో అంగన్వాడి వర్కర్ లు చింతాల పద్మావతి,పెద్దింటి మీనాక్షితోపాటు అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్న చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.