BREAKING
పాతపట్నం మేజర్ పంచాయతీలో సైలాడ సతీష్ ప్రభంజనం. కార్తీక వన సమారాధనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమా ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి : తుమ్మలపల్లి హరికృష్ణ గొల్లపల్లి సర్పంచ్ గా చొక్కా రెడ్డి గారి గీత క్రైస్తవ మత పెద్దలకు కార్పొరేటర్ గోవింద్ కృతజ్ఞతలు కంకిపాడు పోలింగ్ కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యం.. అయ్యప్పల నిత్య అన్నదానానికి విశేష స్పందన గురునాథ్ ఆధ్వర్యంలో పదో వార్డు టిడిపి నేతలతో సమావేశం.... ఊపిరితిత్తుల క్యాన్సర్‌పై అవగాహనకు సైక్లథాన్ *రాజ్యాంగ ఫలాలు అందరికీ దక్కాలి * దేశీయ నోట్‌బుక్ పరిశ్రమకు జీఎస్టీ భారం తగ్గించాలి కార్పొరేటర్ ఏడువాక దంపతులకు ఘన సన్మానం శ్రీకొండలమ్మను దర్శించుకున్న 7 వేలమంది భక్తులు భారత్–శ్రీలంక వన్డే టికెట్ల విక్రయానికి ముహూర్తం ఖరారు ఐదుగురు బాధితులకు సహాయం అందించిన మానవత.

ఘర్షణలు, అల్లర్లకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్

Select Suryaa Now
ఘర్షణలు, అల్లర్లకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు  జిల్లా ఎస్పీ  బి. ఉమామహేశ్వర్

బాపట్ల, మేజర్‌న్యూస్‌ :

రెండవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ పరంగా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టామని, ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించేలా ఘర్షణలు, అల్లర్లకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు హెచ్చరించారు.

శనివారం భట్టిప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని భట్టిప్రోలు మార్కెట్ యార్డులో వేమూరు నియోజకవర్గంలో రెండవ దశ పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహించేందుకు వచ్చిన పోలీస్ అధికారులు, సిబ్బందికి  ఎస్పీ గారు ఎన్నికల విధులపై ప్రత్యేక బ్రీఫింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.. జిల్లాలో నిర్వహించిన మున్సిపల్, ఎంపీటీసీ, మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలను పోలీస్ అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా నిర్వహించారని అభినందించారు. అదే స్ఫూర్తితో ఈ నెల 29న జరగనున్న రెండవ దశ పంచాయతీ ఎన్నికలను కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సమర్ధవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుందని, అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాలలోకి ఓటర్లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరమే అనుమతించాలని, 100 మీటర్ల పరిధిలో ఎవరూ గుమిగూడకుండా పర్యవేక్షించాలని, ఓటర్లు ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా క్యూ లైన్లను క్రమబద్ధీకరించాలని సూచించారు. ఎన్నికల విధుల్లో సాంకేతికతను వినియోగించుకుంటూ ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది తప్పనిసరిగా సమర్థ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని ఆదేశించారు. ఏదైనా సమస్య తలెత్తితే యాప్‌లోని SOS బటన్ ప్రెస్ చెయ్యడం ద్వారా సమీపంలోని పోలీస్ బలగాలకు, కమాండ్ కంట్రోల్ రూమ్‌కు తక్షణ సమాచారం చేరుతుందని, తద్వారా పోలీసులు వేగంగా స్పందించి ఘటన స్థలానికి చేరుకొని శాంతిభద్రతలను పరిరక్షించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.

పోలీస్ అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ  బాధ్యతాయుతంగా తమ విధులు నిర్వహించాలని, ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు స్పష్టం చేశారు.

రెండవ దశలో ఈ నెల 29న బాపట్ల జిల్లాలోని వేమూరు, చీరాల నియోజకవర్గాల పరిధిలోని ఏడు మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయని ఎస్పీ గారు తెలిపారు. ఈ ఏడు మండలాల్లోని సుమారు 113 గ్రామ పంచాయతీల పరిధిలో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ భద్రత ఏర్పాటు చేశామన్నారు.

రెండు నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల విధుల నిర్వహణకు 1400 మందికి పైగా పోలీస్ అధికారులు, సిబ్బందిని నియమించామని, 78కు పైగా రూట్ మొబైల్స్, 65 స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు, 40 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలతో పాటు డీఎస్పీలు, అడిషనల్ ఎస్పీల పర్యవేక్షణలో ప్రత్యేక రిజర్వ్ బలగాలను సిద్ధంగా ఉంచామని తెలిపారు.

వేమూరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో ప్రత్యేకంగా 25  స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు, 38 రూట్ మొబైల్స్ ఏర్పాటు చేయడంతో పాటు ముగ్గురు డీఎస్పీలు, 21 మంది సీఐలు, 34 మంది ఎస్.ఐ లు 900 మందికి పైగా పోలీస్ సిబ్బందిని ఎన్నికల విధులకు నియమించినట్లు తెలిపారు.

జిల్లాలో ఇప్పటివరకు నిర్వహించిన ఎన్నికల ప్రక్రియను ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించామని పేర్కొన్నారు. రెండవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు కూడా ఇదే విధంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టి, ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నామని తెలిపారు.

ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులకు ఎటువంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో, అనంతరం ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించినా, ఘర్షణలు, అల్లర్లకు పాల్పడినా ఉపేక్షించేది లేదని, అటువంటి వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గారు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో రేపల్లె, బాపట్ల, ఏఆర్ డీఎస్పీలు షేక్ అబ్దుల్ అజీజ్, సీహెచ్ చంద్ర మౌళి, పి. కృష్ణంరాజు, వేమూరు, చుండూరు సీఐలతో పాటు బందోబస్తు విధుల నిర్వహణకు వచ్చిన ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.