మదనపల్లె,మేజర్ న్యూస్ : మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున చైర్మన్ అభ్యర్థిగా పోటీచేస్తున్న జింకా వెంకట చలపతి,కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన సతీమణి రాధమ్మ తమ నామినేషన్లను ఘనంగా సమర్పించారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చి అభ్యర్థులకు సంఘీభావం తెలిపారు.ఈ కార్యక్రమంలో మదనపల్లె నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఎస్.నిసార్ అహ్మద్,మాజీ శాసనసభ్యులు డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి,మాజీ శాసనమండలి సభ్యులు బి.నరేష్ కుమార్ రెడ్డి,పార్టీ పరిశీలకులు అనీషా రెడ్డి,డి.ఉదయ్ కుమార్, బాబ్జాన్,ఎస్‌ఈసీ సభ్యురాలు షమీమ్ అస్లాం,మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ మనుజా రెడ్డి,సీనియర్ నాయకులు సి.పి.సుబ్బారెడ్డి,మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి వి.ఎస్.రెడ్డి,రాష్ట్ర ప్రచార కార్యదర్శి సి.పి.రాఘవ రెడ్డి పాల్గొన్నారు.అలాగే మాజీ కౌన్సిలర్లు ఎన్.ఇర్ఫాన్ ఖాన్,బి.ఎ.ఖాజా,శ్రీనివాసులు,నాయకులు యూనస్,అబ్దుల్లా,గ్రానైట్ మహేశ్,వేణుగోపాల్ తదితరులతోపాటు పలువురు పార్టీ నాయకులు,కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.పార్టీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమం సందర్భంగా నాయకులు,కార్యకర్తల హాజరుతో సందడి నెలకొంది.పార్టీ శ్రేణులు అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
రిపోర్టర్ : కె. ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి